ట్విటర్ సహ వ్యవస్థాపకులు, మాజీ సీఈవో ఇవాన్ విలియమ్స్ ట్విట్టర్‌కు దూరం కానున్నారు. పుష్కరకాలం పాటు బోర్డుకు సేవలందించిన విలియమ్స్ అనూహ్యంగా బోర్డునుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. అయితే ట్విటర్‌కు తన సహకారం ఉంటుందని తెలిపారు.
ఈ నెల చివరి నుంచి తన రాజీనామా అమల్లోకి వస్తుందని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్‌కు అందించిన సమాచారంలో తెలిపారు. అటు వరుస ట్విట్లలో కూడా విలియమ్స్ ఈ విషయాన్ని ధృవీకరించారు. 12సంవత్సరాలపాటు ట్విటర్ బోర్డులో పనిచేయడం చాలా అదృష్టమని ఇవాన్ విలియమ్స్ పేర్కొన్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో ట్విట్టర్ అగ్రపథాన నిలబెట్టడంలో కృషి చేసిన ఇవాన్ రాజీనామా సంస్థకు పెద్ద లోొటే.
I’m very lucky to have served on the @Twitter board for 12 years (ever since there was a board). It’s been overwhelmingly interesting, educational—and, at times, challenging.
— Ev Williams (@ev) February 22, 2019