పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో నాడు-నేడు, ట్విన్‌ టన్నెల్‌ పనులకు మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా సంస్థ ప్రతినిధుల భూమి పూజ

|

Jan 03, 2021 | 7:50 PM

పోలవరం ప్రాజెక్ట్‌లో కీలకమైన పనులకు శ్రీకారం చుట్టారు అధికారులు. అసంపూర్తిగా ఉన్న ట్విన్‌ టన్నెల్‌ పనులకు మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా సంస్థ ప్రతినిధులు..

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో నాడు-నేడు, ట్విన్‌ టన్నెల్‌ పనులకు మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా సంస్థ ప్రతినిధుల భూమి పూజ
Follow us on

పోలవరం ప్రాజెక్ట్‌లో కీలకమైన పనులకు శ్రీకారం చుట్టారు అధికారులు. అసంపూర్తిగా ఉన్న ట్విన్‌ టన్నెల్‌ పనులకు మ్యాక్స్‌ ఇన్‌ఫ్రా సంస్థ ప్రతినిధులు, ఇరిగేషన్‌ అధికారులు ఇవాళ భూమి పూజ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి గ్రావిటీ ద్వారా నీళ్లు అందించేందుకు కృషి చేస్తున్నారు. కాగా, పోలవరం ప్రాజెక్ట్‌లో ప్రధాన భాగమైన ట్విన్‌ టన్నెల్‌ పనులు గతంలో కొంతమేర జరిగి… ఆ తర్వాత నిలిచిపోయాయి. దీంతో కొన్ని రోజులుగా టన్నెల్‌లో ఉన్న నీటిని తొలగించిన అనంతరం పనులు ప్రారంభించారు. ఇప్పటికే అవసరమైన సామగ్రిని అక్కడకు చేర్చారు. వేగంగా పనులు చేపట్టడంతో ప్రభుత్వం నిర్దేశించిన టైమ్‌కు ట్విన్‌ టన్నెల్‌ పనులు పూర్తిచేస్తామని చెబుతున్నారు అధికారులు… ఇదిలాఉండాగా,

ఇలా ఉండగా, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గ్యాప్ 3 కాంక్రీట్ డ్యామ్, కాపర్ డ్యాం, కుడి, ఎడమ కాలువలకు నీటిని అందించే సొరంగం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పవర్ హౌస్ పునాదుల త్రవ్వకం సహా వివిధ వర్కులకు సంబంధించి గతంతో పోలిస్తే పనుల పురోగతి ఎలా ఉందో.. అక్కడి తాజా వాస్తవ పరిస్థితులేమిటో చిత్రాలతో సహా చూద్దాం :