వైన్ షాపుల యాజమాన్యం నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన టీవీ 9 ” ఖబర్దార్”

| Edited By:

Jul 22, 2019 | 12:59 AM

తెలుగు మీడియా చరిత్రలో టీవీ9 మరో సంచలనానికి తెరతీసింది. సమాజంలో అడుగడుగునా కనిపిస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నించేందు మరోసారి సిద్ధమైంది. ఈసారి నలుగురు లేడీ జర్నలిస్టుల బృందం “ఖబర్దార్” అంటూ సహాసోపేతంగా అలాంటి వాటిని ప్రజల ముందుంచడానికి ప్రయత్నించారు. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా దాన్ని సేవించకుండా ఉండలేని బలహీన కొందరిది. అయితే అలాంటి వారు ఇంటికి వెళ్లి తాగే వీలు లేకపోతే మద్యం దుకాణం ఏర్పాటుచేసే పర్మిట్ రూమ్స్‌లో కూర్చుని సేవిస్తారు. కానీ హైదరాబాద్ నట్ట […]

వైన్ షాపుల యాజమాన్యం  నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన టీవీ 9  ఖబర్దార్
Follow us on

తెలుగు మీడియా చరిత్రలో టీవీ9 మరో సంచలనానికి తెరతీసింది. సమాజంలో అడుగడుగునా కనిపిస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నించేందు మరోసారి సిద్ధమైంది. ఈసారి నలుగురు లేడీ జర్నలిస్టుల బృందం “ఖబర్దార్” అంటూ సహాసోపేతంగా అలాంటి వాటిని ప్రజల ముందుంచడానికి ప్రయత్నించారు.

మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా దాన్ని సేవించకుండా ఉండలేని బలహీన కొందరిది. అయితే అలాంటి వారు ఇంటికి వెళ్లి తాగే వీలు లేకపోతే మద్యం దుకాణం ఏర్పాటుచేసే పర్మిట్ రూమ్స్‌లో కూర్చుని సేవిస్తారు. కానీ హైదరాబాద్ నట్ట నడిబొడ్డున ఫిల్మ్‌నగర్ ప్రాంతంలో ఉన్న ఒక వైన్ షాపు యాజమాన్యం నిర్లక్యంతో రోజుకు వందలాది మంది రోడ్డుమీదే తాగుతూ.. ఆ దారిన రాకపోకలు సాగించే వారికి ఇబ్బందులు కలిగిస్తున్నారు.

ఇదే విషయాన్ని టీవీ9 “ఖబర్దార్” ప్రోగ్రామ్ ద్వారా నలుగురు లేడీ జర్నలిస్టులు ప్రశ్నించారు. పర్మిట్ రూమ్ కావాలంటే లక్షలు ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. దీనికోసం షాపు యాజమాన్యం ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో మద్యాన్ని కొనుగోలు చేసిన మద్యం బాబులు అక్కడే తాగుతూ ఖాళీ సీసాలను అక్కడే వదిలి వెళ్తున్నారు. ఇలాంటి సీసాలతో ఆ ప్రాంతం పెద్ద గొడౌన్ మాదిరిగా కనిపిస్తోంది. ఫిల్మ్ నగర్ ప్రాంతంలో ఉన్న మద్యం షాపు బాగోతాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపించారు ఈ ఖబర్దార్  ప్రోగ్రాంలో..