దేశంలోని మండలి వ్యవస్థపై టీవీ9 ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్..

|

Jan 23, 2020 | 10:13 PM

దేశంలో ప్రస్తుతం ఆరు రాష్ట్రాలలోనే శాసనమండలి వ్వవస్థ ఉంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ , బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, కర్నాటక, మహారాష్ట్రలో మాత్రమే శాసనమండలి వ్యవస్థ ఉంది. ఏపీ ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేసే దిశగా పావులు కదుపుతుండడంతో ఇక దేశంలో ఐదురాష్ట్రాల్లో మాత్రమే శాసనమండళ్లు ఉండే అవకాశముంది. దేశంలో 28 రాష్ట్రాలు ఉండగా 22 రాష్ట్రాల్లో శాసనమండలి వ్యవస్థ లేదు. బీహార్‌, కర్నాటకలో 75 మంది చొప్పున ఎమ్మెల్సీలు ఉన్నారు. మహారాష్ట్రలో 78 మంది, తెలంగాణలో 40, […]

దేశంలోని మండలి వ్యవస్థపై టీవీ9 ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్..
Follow us on

దేశంలో ప్రస్తుతం ఆరు రాష్ట్రాలలోనే శాసనమండలి వ్వవస్థ ఉంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ , బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, కర్నాటక, మహారాష్ట్రలో మాత్రమే శాసనమండలి వ్యవస్థ ఉంది. ఏపీ ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేసే దిశగా పావులు కదుపుతుండడంతో ఇక దేశంలో ఐదురాష్ట్రాల్లో మాత్రమే శాసనమండళ్లు ఉండే అవకాశముంది. దేశంలో 28 రాష్ట్రాలు ఉండగా 22 రాష్ట్రాల్లో శాసనమండలి వ్యవస్థ లేదు.

బీహార్‌, కర్నాటకలో 75 మంది చొప్పున ఎమ్మెల్సీలు ఉన్నారు. మహారాష్ట్రలో 78 మంది, తెలంగాణలో 40, ఉత్తరప్రదేశ్‌లో 100 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. జమ్ముకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంతో గత ఏడాది అక్కడ శాసనమండలిని రద్దు చేశారు. గతంలో అసోం, మధ్యప్రదేశ్‌, తమిళనాడు, పంజాబ్‌, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల్లో కూడా శాసనమండళ్లు ఉండేవి. అయితే ఈ రాష్ట్రాల్లో శాసనమండలి వ్యవస్థను రద్దు చేశారు. మళ్లీ ఇక్కడ శాసనమండలిలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ వస్తోంది. ఢిల్లీతో పాటు    హిమాచల్‌ప్రదేశ్‌, ఒడిశా,రాజస్థాన్‌,ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో కూడా శాసనమండళ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ వస్తోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 168 ప్రకారం రాష్ట్రాల్లో విధానపరిషత్‌లను ఏర్పాటు చేస్తారు.