ఉనికి కోసమే కాంగ్రెస్ నేతల నీటి డ్రామాలు : మంత్రి జగదీష్ రెడ్డి

| Edited By: Pardhasaradhi Peri

Jun 03, 2020 | 11:32 AM

పదవుల కోసం ప్రాజెక్టులను అడ్డుకున్నోళ్లు జలదీక్షలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్రంలలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నేతలు రాజకీయాల కోసమే కొత్త డ్రామాలు మొదలుపెట్టారన్న మంత్రి జగదీష్ రెడ్డి.

ఉనికి కోసమే కాంగ్రెస్ నేతల నీటి డ్రామాలు : మంత్రి జగదీష్ రెడ్డి
Follow us on

పదవుల కోసం ప్రాజెక్టులను అడ్డుకున్నోళ్లు జలదీక్షలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ నేతలు రాజకీయాల కోసమే కొత్త డ్రామాలు మొదలుపెట్టారన్నారు. ఆంధ్ర నేతల మంత్రివర్గంలో మంత్రులుగా ఉండి ఏనాడు పోతిరెడ్డి పాడుతో పాటు ఆంధ్ర అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోలేకపోయారని మండిపడ్డారు. సీమాంధ్రకు పోయిన తెలంగాణ నీళ్లకు హారతులు పట్టిన నేతలే ఈ రోజు పోతిరెడ్డిపాడు గురించి నీతులు చెబుతున్నారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నీటి ద్రోహానికి పాల్పడింది కాంగ్రెస్ నేతలన్న మంత్రి.. వారి నిర్వాకంతో ఏ ఒక్క ప్రాజెక్టు గానీ, రిజర్వాయర్ గానీ నిర్మాణం చేపట్టలేదని మండిపడ్డారు. కనీసం తెలంగాణను ఒక ప్రాంతంగానైనా గుర్తించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గోదావరి మిగులు జలాలను వాడుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదని స్పష్టం చేసిన మంత్రి.. ఏపీ ఫ్రభత్వం ఇచ్చిన జీవోపై కృష్ణా బోర్డులో ఫిర్యాదు చేశామన్నారు. కృష్ణా నదిపై చేపట్టే అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. మరోవైపు జీవో 203పై కాంగ్రెస్, బీజేపీ అధినాయకత్వం తమ అభిప్రాయం స్పష్టం చేయాలని మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. 2013-14లో ఎంత పంట పండింది ఇప్పడు ఎంత దిగుబడి వచ్చిందో లెక్కలు చూడాలన్నారు మంత్రి. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కోయిల్ సాగర్ ,నెట్టెంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, భీమా లిఫ్ట్ ఇరిగేషన్, డిండి ప్రాజెక్టులకు నీళ్లు రప్పించగలిగామని స్పష్టం చేశారు మంత్రి జగదీష్ రెడ్డి.