సరికొత్త సెంట్రల్ స్కీం… ఏకంగా రెండు కోట్ల యువతకు ఉపాధికి అవకాశం.. బ్రాడ్ బ్యాండ్ ఇండియా వెల్లడి

|

Dec 17, 2020 | 9:11 PM

‘పీఎం వాణి’ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా ప్రజలందరికి ఇంటర్‌నెట్ సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం అధ్యక్షుడు రామచంద్రన్ స్పష్టం చేశారు.

సరికొత్త సెంట్రల్ స్కీం... ఏకంగా రెండు కోట్ల యువతకు ఉపాధికి అవకాశం.. బ్రాడ్ బ్యాండ్ ఇండియా వెల్లడి
Follow us on

‘పీఎం వాణి (ప్రధానమంత్రి వైఫై యాక్సెస్​ నెట్​వర్క్​ ఇంటర్​ఫేస్​)’ పథకం ద్వారా దేశ వ్యాప్తంగా ప్రజలందరికి ఇంటర్‌నెట్ సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం అధ్యక్షుడు రామచంద్రన్ స్పష్టం చేశారు. తక్కువ ఖర్చుతో కూడిన మాస్ కనెక్టివిటీ మార్గాలను అందించడంతో పాటు, 2 కోట్ల మందికి పైగా యువత ఉద్యోగావకాశాలను పొందగల సామర్థ్యం పబ్లిక్ వై-ఫై మోడల్‌కి ఉందని అన్నారు. కొత్త స్కీం కింద పబ్లిక్​ ప్లేసెస్​లో వైఫై కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన వెల్లడించారు.

దేశంలో మారుమూల పల్లెలకు సైతం ఇంటర్నెట్​ సదుపాయాలను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేసింది. జనానికి పీఎం వాణి స్కీం ద్వారా.. ఫ్రీగా వైఫైని అందించబోతోంది. పబ్లిక్‌ డేటా ఆఫీస్‌ (పీడీఓ)ల ద్వారా పబ్లిక్‌ వైఫై నెట్‌వర్క్‌లను నెలకొల్పే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానం పబ్లిక్‌ డేటా ఆఫీస్‌ (పీడీఓ), పబ్లిక్‌ డేటా ఆఫీస్‌ అగ్రిగేటర్లు(పీడీఓఏ), యాప్‌ డెవలపర్లు ఇలా వివిధ వర్గాల భాగస్వామ్యంతో అందుబాటులోకి రానుంది. ‘పీడీఓలకు లైసెన్స్, రిజిస్ట్రేషన్, అలాగే ఫీజు వంటివి ఏవీ వర్తించవు.