సర్వదర్శనం టోకెన్ల జారీ కొనసాగింపు

|

Nov 02, 2020 | 8:03 PM

సర్వదర్శనం టోకెన్ల జారీని కొనసాగిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ నెల 10 వరకు ఈ ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయించింది.

సర్వదర్శనం టోకెన్ల జారీ కొనసాగింపు
Follow us on

సర్వదర్శనం టోకెన్ల జారీని కొనసాగిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ నెల 10 వరకు ఈ ప్రక్రియను కొనసాగించాలని నిర్ణయించింది. టోకెన్ల జారీ సెంటర్లను కూడా పెంచాలని డిసైడయ్యింది. ఈ క్రమంలో మహతి ఆడిటోరియం, విష్ణు నివాసం, గోవిందరాజస్వామి సత్రాల వద్ద సర్వదర్శనం టోకెన్ల జారీ కేంద్రాలు తెరవనున్నారు. 10వ తేదీ వరకు ట్రయల్‌ రన్‌ నిర్వహించి తర్వాత తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తిరుమల శ్రీవారి ఉచిత స్లాటెడ్‌ సర్వదర్శన టోకెన్ల జారీని టీటీడీ తిరిగి ప్రారంభించిన సంగతి తెలిసిందే. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్‌లో గల కౌంటర్లలో రోజుకు మూడు వేల టోకెన్లను ఉదయం 5గంటల నుంచి భక్తులకు అందజేస్తున్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి  దర్శనానికి సంబంధించి ఒకరోజు ముందు టోకెన్లు తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read :

దారుణం..జన్మనిచ్చిన అమ్మనే సజీవ దహనం చేసిన కొడుకు

కరోనా అప్‌డేట్ : ఏపీలో కొత్తగా 1,916 పాజిటివ్ కేసులు