శ్రీవారి భక్తులకు తీపికబురు అందించిన టీటీడీ!

|

Nov 17, 2019 | 9:53 PM

తిరుమల లడ్డూ ధరలను టీటీడీ పెంచనున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. లడ్డూ రేట్లను పెంచే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా చెన్నైలో శ్రీవారి ఆలయం నిర్మించడానికి తమిళనాడు ప్రభుత్వం స్థలం కేటాయించిందన్నారు. చెన్నై స్థానిక సలహామండలి కమిటీ టీటీడీలో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా చీఫ్ గెస్ట్‌గా హాజరైన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పలు అంశాల గురించి ప్రస్తావిస్తూ.. […]

శ్రీవారి భక్తులకు తీపికబురు అందించిన టీటీడీ!
Follow us on

తిరుమల లడ్డూ ధరలను టీటీడీ పెంచనున్నట్లు గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి క్లారిటీ ఇచ్చారు. లడ్డూ రేట్లను పెంచే ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా చెన్నైలో శ్రీవారి ఆలయం నిర్మించడానికి తమిళనాడు ప్రభుత్వం స్థలం కేటాయించిందన్నారు.

చెన్నై స్థానిక సలహామండలి కమిటీ టీటీడీలో బాధ్యతలు చేపట్టిన సందర్భంగా చీఫ్ గెస్ట్‌గా హాజరైన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పలు అంశాల గురించి ప్రస్తావిస్తూ.. భక్తులకు పూర్తి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే ప్రతీ భక్తుడికి ఉచితంగా లడ్డూ ఇచ్చి.. ఆపై రూ.50కి ఒక్కో లడ్డూను విక్రయించే యోచనలో టీటీడీ ఉన్నట్లు వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని.. అంతేకాకుండా అతిధి గృహాల అద్దె పెంపుపైన కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.