టీటీడీ నిధుల వివాదంపై బోర్డు క్లారిటీ..!

|

Oct 17, 2020 | 7:05 PM

రాష్ట్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి వివాదంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. టీటీడీ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారనే ప్రచారం అవాస్తవమని బోర్డు

టీటీడీ నిధుల వివాదంపై బోర్డు క్లారిటీ..!
Follow us on

TTD Board Clarity On Funds: రాష్ట్ర ప్రభుత్వ బాండ్లలో పెట్టుబడి వివాదంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. టీటీడీ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నారనే ప్రచారం అవాస్తవమని బోర్డు వెల్లడించింది. కేవలం బాండ్లను మాత్రమే తీసుకుంటున్నామని స్పష్టం చేసింది. వివిధ బ్యాంకుల్లో ఉన్న నగదుకు మూడు శాతం వడ్డీ మాత్రమే వస్తోందని.. రాష్ట్ర ప్రభుత్వ బాండ్ల కొనుగోలుతో ఏడు శాతం వడ్డీ వస్తోందని టీటీడీ బోర్డు తెలిపింది. అన్నదాన, బర్ద్, గోసంరక్షణ ట్రస్టులు టీటీడీపైనే ఆధారపడ్డాయి. ఈ క్రమంలోనే వడ్డీ ఆదాయం పెంచేందుకే పాలకమండలి ఈ నిర్ణయం తీసుకుందని టీటీడీ పేర్కొంది. రూల్‌ నెంబర్‌ 80 ప్రకారం ఎక్కడైనా పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఉందని.. 1990లో జారీ చేసిన జీవో 311లో ఇదే విషయాన్ని స్పష్టం చేశారని టీటీడీ బోర్డు తెలిపింది.

Also Read: వాళ్లకే తొలి దశ కరోనా వ్యాక్సిన్: కేంద్రం