టీటీడీ బంపర్ ఆఫర్.. ఇక సామాన్యులకూ వీఐపీ బ్రేక్ దర్శనం..!

| Edited By:

Oct 22, 2019 | 6:08 AM

టీటీడీ శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటి వరకు రాజకీయనాయకులకు, సెలబ్రిటీలకు ఉన్న వీఐపీ బ్రేక్ దర్శనాలను.. సామాన్యులకు కూడా కల్పించేందుకు సిద్ధమైంది. అయితే దీనికి కొన్ని నిబంధనలు పెట్టింది. అదేంటంటే.. వీఐపీ బ్రేక్ దర్శనం కావాలనుకునే భక్తులు రూ.10 వేలు డొనేట్ చేయాల్సి ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం (శ్రీవాణి ట్రస్ట్) పేరుతో ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చినట్లు టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ సేవలు సోమవారం నుంచే అమల్లోకి […]

టీటీడీ బంపర్ ఆఫర్.. ఇక సామాన్యులకూ వీఐపీ బ్రేక్ దర్శనం..!
Follow us on

టీటీడీ శ్రీవారి భక్తులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటి వరకు రాజకీయనాయకులకు, సెలబ్రిటీలకు ఉన్న వీఐపీ బ్రేక్ దర్శనాలను.. సామాన్యులకు కూడా కల్పించేందుకు సిద్ధమైంది. అయితే దీనికి కొన్ని నిబంధనలు పెట్టింది. అదేంటంటే.. వీఐపీ బ్రేక్ దర్శనం కావాలనుకునే భక్తులు రూ.10 వేలు డొనేట్ చేయాల్సి ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణం (శ్రీవాణి ట్రస్ట్) పేరుతో ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చినట్లు టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ సేవలు సోమవారం నుంచే అమల్లోకి వచ్చాయన్నారు. శ్రీవాణి ట్రస్ట్‌కు రూ.10వేలు విరాళమిచ్చే భక్తులందరికీ వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్లు అందిస్తామన్నారు.

అయితే ఈ విరాళాల కోసం గోకులం కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాదు.. ఈ సేవలను ఆన్‌లైన్‌లో కూడా తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నవంబరు తొలి వారంలో శ్రీవాణి ట్రస్ట్‌కు సంబంధించిన యాప్‌ను భక్తులకు అందుబాటులోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు. ఇక మొదటి 15 రోజులు తిరుమలలో కరెంట్ బుకింగ్ ద్వారా టికెట్లను అందించనున్నారు. అయితే భక్తులు రూ. 10వేల విరాళంతో పాటు రూ.500 టికెట్ కూడా కొనాల్సి ఉంటుంది. విరాళాలు ఇచ్చిన భక్తులకు ప్రొటోకాల్ పరిధిలోకి తెచ్చి ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించనున్నారు. దీనికి సంబంధించిన కోటాను ఒక నెల ముందుగానే విడుదల చేస్తామని టీటీడీ పేర్కొంది. ఇక శ్రీవాణి ట్రస్ట్‌ ద్వారా వచ్చే విరాళాలను టీటీడీ ఆలయాల పరిరక్షణ.. నిర్మాణాలకు ఉపయోగిస్తామని అధికారులు వెల్లడించారు.