‘సంక్రాంతి ఫెస్టివల్‌’కి తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ ఆపరేషన్!

| Edited By: Pardhasaradhi Peri

Jan 05, 2021 | 6:27 PM

సంక్రాంతి పండుగకి వెళ్లే వారి సంఖ్య ఏటాఏటా పెరుగుతూనే ఉంది. ఈ పండుగను ఆసరాగా చేసుకుని ప్రయాణికులను అడ్డంగా దోచుకోవడంలో..

సంక్రాంతి ఫెస్టివల్‌కి తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ ఆపరేషన్!
Follow us on

సంక్రాంతి పండుగకి వెళ్లే వారి సంఖ్య ఏటాఏటా పెరుగుతూనే ఉంది. ఈ పండుగను ఆసరాగా చేసుకుని ప్రయాణికులను అడ్డంగా దోచుకోవడంలో ప్రైవేట్ ట్రావెల్స్ ముందుంటాయి. డబుల్‌కి డబుల్ రేట్లు పెంచుతూ.. వారి కష్టాన్ని స్వాహా చేస్తాయి. అయితే.. వీటికి అడ్డుకట్ట వేస్తూ.. ఆర్టీసీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. నష్ట నివారణకు తెలంగాణ ఆర్టీసీ కసరత్తులు ప్రారంభించింది. సంక్రాంతి సర్వీసుల కోసం ఆర్టీసీ స్పెషల్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులపై దృష్టి సారించి.. వారికోసం అదనపు బస్సునలు ఏర్పాటు చేసింది సర్కార్. సంక్రాంతి ప్రయాణికుల కోసం ‘మే ఐ హెల్ప్‌ యూ’ అనే బూత్‌లు కూడా ఏర్పాటు చేయనుంది. అయితే ప్రైవేట్ వాహనాలకు బ్రేక్ వేసేందుకు పోలీసుల సహాయం కోరింది టీఎస్ ఆర్టీసీ. ప్రైవేటు వ్యాపారుల చేతిలో ప్రయాణికులు మోసపోకుండా.. ఇలాంటి ఏర్పాట్లు చేసింది టీఎస్‌ఆర్టీసీ.

కాగా.. ఇప్పటికే రైల్వే రిజర్వేషన్లు పూర్తైనట్లు అధికారులు చెబుతున్నారు. గోదావరి వెయిటింగ్‌ లిస్టు 180కి పైగానే ఉందట. జన్మభూమి 300 వెయిటింగ్ లిస్ట్ చూపిస్తోంది. గౌతమి అయితే 800కు పైగానే చూపిస్తోంది. మరికొన్నింటికి వెయిటింగ్ లిస్ట్ ఆప్షనే తీసేశారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే.. జనవరి మొదటి వారం ఇంకా ఎలా ఉంటుందోనన్న ఆందోళన ప్రయాణికుల్లో కనిపిస్తోంది. ఆల్రెడి వెయిటింగ్ లిస్టులో ఉన్నవాళ్లు కన్ఫర్మ్ అవుతుందో లేదో తెలియక ఆయోమయంలో ఉన్నారు.