నాలుగోరోజూ నగరంలో కేటీఆర్ పర్యటన.. అప్పచెరువు బాధితులకు ఎక్స్‌గ్రేషియా

|

Oct 17, 2020 | 12:17 PM

వరుసగా నాలుగో రోజు రాజధాని నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు పరిశీలిస్తున్నారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మేమున్నామంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో వరదల్లో చనిపోయిన పలువురికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను కేటీఆర్ ఈ ఉదయం అందించారు. వరదల వలన ప్రాణ నష్టం జరగడం బాధాకరమన్న కేటీఆర్.. ప్రాణ నష్టం అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా […]

నాలుగోరోజూ నగరంలో కేటీఆర్ పర్యటన.. అప్పచెరువు బాధితులకు ఎక్స్‌గ్రేషియా
Follow us on

వరుసగా నాలుగో రోజు రాజధాని నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు పరిశీలిస్తున్నారు. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ మేమున్నామంటూ భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో వరదల్లో చనిపోయిన పలువురికి ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెక్కులను కేటీఆర్ ఈ ఉదయం అందించారు. వరదల వలన ప్రాణ నష్టం జరగడం బాధాకరమన్న కేటీఆర్.. ప్రాణ నష్టం అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించిందని తెలిపారు. వర్షాలు పూర్తిగా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం ప్రజలకు అవసరమైన రేషన్ కిట్లు, వైద్యం, ఇతర తక్షణ సదుపాయాలను కల్పించే దిశగా ప్రయత్నం చేస్తుందని వెల్లడించారు. పారిశుద్ధ్యం పైన ప్రధానంగా దృష్టి సారించి పని చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు కేటీఆర్ మార్గనిర్దేశం చేశారు.

మొన్నటి భారీ వర్షాలకు జనావాసాల పైకి వరద నీరు రావటానికి కారణమైన రాజేంద్రనగర్ గగన్ పహాడ్ దగ్గరున్న అప్ప చెరువుని మంత్రి పరిశీలించారు. సాగునీటి శాఖతో సమన్వయం చేసుకొని వెంటనే చెరువుకట్టకు తగిన మరమ్మతులు చేయాలని కేటీఆర్ సూచించారు. చెరువులో వెలసిన ఆక్రమణలు ఏవైనా ఉంటే వాటిని తొలగించాలని స్థానిక రెవెన్యూ అధికారులకి కేటీఆర్ ఆదేశాలిచ్చారు. ఈ పర్యటనలో కేటీఆర్ వెంట మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏంపిలు రంజిత్ రెడ్డి, అసదుద్దీన్ ఓవైసీ, స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఉన్నారు.