Ts emcet update: వచ్చే ఏడాది ఎంసెట్ పరీక్ష ఎప్పుడంటే.. జనవరిలో ప్రకటించనున్న విద్యాశాఖ.?

|

Dec 30, 2020 | 4:18 PM

Ts emcet exam date: వచ్చే ఏడాది తెలంగాణలో నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను జనవరిలో ప్రకటించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. 2021-2022 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంసెట్, ఎడ్‌సెట్, ఐసెట్ వంటి ప్రవేశ పరీక్షల తేదీలను త్వరలోనే..

Ts emcet update: వచ్చే ఏడాది ఎంసెట్ పరీక్ష ఎప్పుడంటే.. జనవరిలో ప్రకటించనున్న విద్యాశాఖ.?
Follow us on

Ts emcet exam date: వచ్చే ఏడాది తెలంగాణలో నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను జనవరిలో ప్రకటించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. 2021-2022 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంసెట్, ఎడ్‌సెట్, ఐసెట్ వంటి ప్రవేశ పరీక్షల తేదీలను త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం. ఇక జేఈఈ మెయిన్ పరీక్ష పూర్తయిన తర్వాత జూన్‌లో ఎంసెట్ నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. తొలుత ఎంసెట్ ఆ తర్వాత మిగతా ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించనున్నారు.
ఇదిలా ఉంటే సహజంగా ప్రతీ ఏడాది మే నెలలో ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తుంటారు. అయితే కరోనా కరాణంగా ఈ ఏడాది ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్, అక్టోబర్ మొదటి వారంలో జరపాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికీ కాలేజీలు ప్రారంభంకాలేవు, ఆన్‌లైన్ తరగతుల ద్వారానే విద్యార్థులు పాఠాలు వింటున్నారు. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొనే ఈసారి ఇంటర్ పరీక్షలను నెలాఖరులో ప్రారంభించాలని అధికారులు యోచిస్తున్నారు.
Also read: న్యూ ఇయర్ కి రోబోల వెరైటీ డ్యాన్స్, ఈ ఫన్నీ వీడియోపై ఓ లుక్ వేయాల్సిందే ! వావ్ అనిపించిన బోస్టన్ కంపెనీ ‘డ్యాన్సర్లు’