డిగ్రీ విద్యార్థులకు అలెర్ట్.. దోస్త్ 2020 ప్రక్రియ వాయిదా.!

|

Jul 01, 2020 | 2:39 PM

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దోస్త్ 2020 ప్రక్రియను 15 రోజుల పాటు వాయిదా పడింది.

డిగ్రీ విద్యార్థులకు అలెర్ట్.. దోస్త్ 2020 ప్రక్రియ వాయిదా.!
Follow us on

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫేజ్-1 రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల ప్రక్రియకు షెడ్యూల్‌ను కూడా ఖరారు చేసింది. వాస్తవానికి ఇవాళ్టి నుంచే రిజిస్ట్రేషన్లు షురూ కావాల్సి ఉంది.

అయితే రాష్ట్రంలో ఒకవైపు కరోనా వైరస్ విజృంభణ.. మరోవైపు లాక్‌డౌన్ విధిస్తారంటూ వార్తలు జోరుగా ప్రచారం అవుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ దోస్త్ 2020 ప్రక్రియను 15 రోజుల పాటు వాయిదా వేసింది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది.

Also Read: కంటైన్మెంట్ జోన్లలో 31 వరకు లాక్‌డౌన్.. తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు..