ట్విటర్ ప్రధాన కార్యాలయం వద్ద ట్రంప్ మద్దతుదారుల నిరసన ప్రదర్శన, ఫ్లాప్ అయిన షో, ఇంకేం మిగిలుంది ?

| Edited By: Pardhasaradhi Peri

Jan 12, 2021 | 9:56 AM

శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధానకార్యాలయం వద్ద సోమవారం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు ప్రొటెస్ట్ చేశారు..

ట్విటర్ ప్రధాన కార్యాలయం వద్ద ట్రంప్ మద్దతుదారుల నిరసన ప్రదర్శన, ఫ్లాప్ అయిన షో, ఇంకేం మిగిలుంది ?
Follow us on

Trump Supporters Protest: శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విటర్ ప్రధానకార్యాలయం వద్ద సోమవారం అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు ప్రొటెస్ట్ చేశారు. అయితే ఇది పూర్తిగా విఫలమయింది.  కొద్దిమంది మాత్రమే  ఈ  విఫల షో లో పాల్గొన్నారు. క్యాపిటల్ హిల్ లో తన సపోర్టర్ల చేత ట్రంప్ చేయించిన అల్లర్ల నేపథ్యంలో ట్రంప్ ను ట్విటర్ శాశ్వతంగా బ్యాన్ చేసింది. కానీ ఇందుకు కూడా ఆయన అభిమానులు ప్రొటెస్ట్ చేశారు. కరోనా వైరస్ పాండమిక్ కారణంగా ట్విటర్ ఉద్యోగుల్లో చాలామంది ఇళ్ల నుంచే విధులు నిర్వహించడంతో కార్యాలయం బోసిగా కనిపించింది. పైగా ఆఫీసు వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులు, అధికారులు మోహరించి ఉండడంతో ట్రంప్ సపోర్టర్లు పరిమిత సంఖ్యలో మాత్రమే హాజరయ్యారు.

అటు ట్రంప్ ను అభిశంసించేందుకు డెమొక్రాట్లు సమాయత్తమవుతున్నారు. కొందరు రిపబ్లికన్లు కూడా వీరితో చేతులు కలపడం విశేషం. త్వరలో ట్రంప్ ఇంపీచ్ మెంట్ ప్రక్రియ ప్రారంభం కానుంది.

 

 

Also Read:

Increased Cold: తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి తీవ్రత.. ఉత్తరాది చలిగాలులతో తగ్గిన ఉష్ణోగ్రతలు

గ్రేటర్‌లో ఉచిత మంచినీటి పంపిణీ.. ఇవాళ శ్రీకారం చుట్టనున్న మంత్రి కేటీఆర్

థాయ్‌లాండ్ ఓపెన్‌కు సిద్ధమవుతున్న పీవీ సింధు, సైనా నెహ్వాల్‌.. దాదాపు పది నెలల తర్వాత బరిలోకి..