అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేసే ప్రసక్తే లేదు: ట్రంప్

| Edited By:

Apr 28, 2020 | 6:31 PM

కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యాలు అతలాకుతలమయ్యాయి. అమెరికా కరోనాకు కేంద్రంగా మారింది. అమెరికాలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య పది లక్షలు దాటింది.

అధ్యక్ష ఎన్నికలను వాయిదా వేసే ప్రసక్తే లేదు: ట్రంప్
Follow us on

Donald Trump: కోవిద్-19 ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు అగ్రరాజ్యాలు అతలాకుతలమయ్యాయి. అమెరికా కరోనాకు కేంద్రంగా మారింది. అమెరికాలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య పది లక్షలు దాటింది. చనిపోయిన వారి సంఖ్య దాదాపు 57 వేలకు చేరింది. అయితే.. అమెరికాలో నవంబర్ 3వ తేదీన జరగాల్సిన అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడే అవకాశముందని అనేక వార్తలు వచ్చాయి. డెమొక్రట్ పార్టీ అభ్యర్థి జో బిడెన్ కూడా ట్రంప్ ఎన్నికల తేదీని మార్చనున్నారని ఇటీవల మీడియాకు తెలిపారు.

కాగా.. అధ్యక్ష ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తే లేదని ట్రంప్ తెలిపారు. నవంబర్ 3వ తేదీనే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. తాను ఇప్పటివరకు ఎన్నికల తేదీ మార్చాలనే ఆలోచన కూడా చేయలేదని, ఆ అవసరం కూడా లేదన్నారు. అధ్యక్ష ఎన్నికల కోసం తాను ఎదురుచూస్తున్నానని ట్రంప్ అన్నారు. ఎవరో చిన్న చిన్న వార్తలు రాసుకునే వారు ఈ పుకారును సృష్టించారని, ఆ పుకారునే జో బిడెన్ నిజం అనుకుని చెబుతున్నారని ట్రంప్ వివరించారు.

Also Read: కరోనా కు కొత్త మందు.. రెండు రోజుల్లో వైరస్ అంతం..?