అక్టోబర్ లోనే అమెరికాలో వ్యాక్సిన్ !

|

Sep 17, 2020 | 8:41 PM

నవంబర్ 3 న అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే కరోనా వైరస్ ఆ దేశంలో భారీ డ్యామేజ్ చేసింది.

అక్టోబర్ లోనే అమెరికాలో వ్యాక్సిన్ !
Follow us on

నవంబర్ 3 న అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే కరోనా వైరస్ ఆ దేశంలో భారీ డ్యామేజ్ చేసింది. భారీగా కేసులు, మరణాలతో ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. ఇది ట్రంప్ కు నెగటివ్ గా మారింది. ఎన్నికలకు ముందే వ్యాక్సిన్ సిద్ధం చేసి ప్రచారాస్త్రంగా మల్చుకోవాలనేది ట్రంప్ భావిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.

అందుకే ఆయన ఇటీవలి కాలంలో  తరచూ అక్టోబర్ సర్ ప్రైజ్ అని చెబుతున్నారు. అక్టోబర్ లో అమెరికన్ ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వనున్నారనేది దీని సారాంశంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. 70 లక్షల కేసులు, 2 లక్షలకు పైగా మరణాలతో ఆ దేశంతో కరోనాతో కకావికలం అయింది. ప్రభుత్వం విమర్శలు ఎదుర్కుంది. ఎన్నికల వేళ కరోనా ప్రభావం కచ్చితంగా డోనాల్డ్ ట్రంప్ విజయావకాశాలపై ప్రభావం చూపుతుంది. ఈ నేపధ్యంలో వ్యాక్సిన్ ను సిద్ధం చేసి ప్రజలను ప్రసన్నం చేసుకోవడం ట్రంప్ వ్యూహంగా ఉంది. ఒకవేళ అక్టోబర్ కాకపోయినా కనీసం నవంబర్ 3 అధ్యక్ష ఎన్నికలకు రెండ్రోజుల ముందైనా వ్యాక్సిన్ అందించవచ్చనే ధీమా ట్రంప్ సర్కార్ లో కనిపిస్తోంది. ఇప్పటికే వాక్సిన్‌ ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా రాష్ట్రాలకు సూచించారు. అంతేకాదు అందరికీ ఉచితంగా ఇవ్వబోతున్నామని ఆయన సంకేతాలు ఇస్తున్నారు. మరి ఏం జరుగుతుందో లెట్స్ వెయిట్ అండ్ సీ.

Also Read : ఒక్క రోజులో రేషన్ కార్డ్, జగన్ సర్కార్ నయా రికార్డ్