GHMC Election Results 2020: ఫలితం ఆశించిన విధంగా రాలేదు, మరో 25 సీట్లు వస్తాయనుకున్నాం.. 12 సీట్లలో పదుల సంఖ్య తేడాలో టీఆర్ఎస్ ఓడింది: కేటీఆర్

|

Dec 04, 2020 | 9:19 PM

జీహెచ్ఎంసీ ఫలితం మేము ఆశించిన విధంగా రాలేదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. "మరో 25 సీట్లు వస్తాయి అనుకున్నాము..

GHMC Election Results 2020: ఫలితం ఆశించిన విధంగా రాలేదు, మరో 25 సీట్లు వస్తాయనుకున్నాం.. 12 సీట్లలో పదుల సంఖ్య తేడాలో టీఆర్ఎస్ ఓడింది: కేటీఆర్
Follow us on

జీహెచ్ఎంసీ ఫలితం మేము ఆశించిన విధంగా రాలేదన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. “మరో 25 సీట్లు వస్తాయి అనుకున్నాము..12 సీట్లలో పదుల సంఖ్యలో టీఆర్ఎస్ ఓడిపోయింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.. పార్టీలో పోస్ట్ మార్టం చేసుకుంటాం. మేయర్ పీఠం పై కూర్చునేందుకు రెండు నెలల సమయం ఉంది. పార్టీ ఆదేశాల మేరకు పనిచేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు. టీఆరెస్ కు ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.” అని కేటీఆర్ చెప్పారు. ఓట్ల లెక్కింపు, ఫలితాలు.. దాదాపు వెల్లడైన అనంతరం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 10 నుంచి12 సీట్లును స్పల్ప తేడాతో కోల్పోయామని.. అయితే, ఈ ఫలితాలను చూసి నిరాశ చెందనక్కరలేదని కేటీఆర్ పార్టీ వర్గాలకు సూచించారు. బీఎన్‌రెడ్డిలో 18, మౌలాలిలో 200 ఓట్ల తేడాతో ఓడిపోయిన విషయాన్ని కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.