టీఆర్ఎస్ సోషల్ మీడియా టీంతో కేటీఆర్ భేటీ.. మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం!

| Edited By: Ram Naramaneni

Jan 13, 2020 | 7:39 PM

తెలంగాణ భవన్ లో కేటీఆర్ ఈ రోజు సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియా గులాబీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. జగన్ రాకతో కొన్ని గంటల జాప్యం తరువాత ఈ సమావేశం ప్రారంభమైంది. ఆలస్యానికి మన్నించాలని కార్యకర్తలకు కేటీఆర్ విన్నవించారు. టీఆరెస్ ను ‘తిరుగులేని రాజకీయ శక్తి’గా అభివర్ణించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీఆరెస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. నేడు సామజిక మాథ్యమం అనేది చాలా బలమైన ప్రత్యామ్నాయంగా మారింది.. మనకు 60 లక్షల మంది […]

టీఆర్ఎస్ సోషల్ మీడియా టీంతో కేటీఆర్ భేటీ.. మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం!
Follow us on

తెలంగాణ భవన్ లో కేటీఆర్ ఈ రోజు సమావేశం నిర్వహించారు. సోషల్ మీడియా గులాబీ శ్రేణులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. జగన్ రాకతో కొన్ని గంటల జాప్యం తరువాత ఈ సమావేశం ప్రారంభమైంది. ఆలస్యానికి మన్నించాలని కార్యకర్తలకు కేటీఆర్ విన్నవించారు. టీఆరెస్ ను ‘తిరుగులేని రాజకీయ శక్తి’గా అభివర్ణించారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా టీఆరెస్ శ్రేణులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. నేడు సామజిక మాథ్యమం అనేది చాలా బలమైన ప్రత్యామ్నాయంగా మారింది.. మనకు 60 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఒక ప్రాంతీయ పార్టీకి ఇంతమంది సభ్యులు ఉండడం చాలా అరుదు. మన పార్టీ ఫేస్ బుక్ పేజీలో 11 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారని అయన తెలిపారు. ఇతర పార్టీలు మన దరిదాపుల్లో లేవని కేటీఆర్ స్పష్టంచేశారు. చాలా మంది మంత్రులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడాన్ని ఆయన ప్రశంసించారు. దీంతో పాటు ప్రజల్లో అభిమానం అనేది చాలా ముఖ్యమని అయన తెలిపారు.