గల్ఫ్‌ కార్మికుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి క‌ృషి చేస్తా : ఎమ్మెల్సీ కవిత

|

Dec 07, 2020 | 5:50 AM

గల్ఫ్‌ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు...

గల్ఫ్‌ కార్మికుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి క‌ృషి చేస్తా : ఎమ్మెల్సీ కవిత
Follow us on

గల్ఫ్‌ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. గల్ఫ్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, గల్ఫ్‌ సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, నకిలీ ఏజెంట్లను గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ గల్ఫ్‌ కార్మికుల సంక్షేమ సంఘం నేతలు ఆమెను కలిసిన నేపథ్యంలో ఈ ప్రకటన చేశారు. సంఘం సభ్యులు ఎమ్మెల్సీ కవిత, మంత్రి ప్రశాంత్‌ రెడ్డిని వేర్వేరుగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు. గల్ఫ్‌ దేశాల నుంచి సొంత ప్రాంతాలకు వచ్చిన రాష్ట్ర వాసులకు తిరిగి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, న్యాక్‌ ద్వారా ఉపాధికి శిక్షణనిస్తున్నామని, దీనిని గ్రామీణ స్థాయికి విస్తరిస్తామని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు.