మౌనం వీడిన కవితమ్మ.. ‘బతుకమ్మ’ వీడియోలో ఏం చెప్పారంటే..!

| Edited By:

Sep 28, 2019 | 6:19 PM

బతుకమ్మ పండుగ రానే వచ్చేసింది. ఆల్రేడీ తెలంగాణ వ్యాప్తంగా.. బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. ఆడపడుచులంతా ఉదయాన్నే సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మలను అలంకరిస్తున్నారు. ముందుగా వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోతోంది. తెలంగాణలోని అన్ని ప్రాంతాలు.. నేటి నుంచి అక్టోబర్ 6 వరకు రంగు రంగుల బతుకమ్మలతో చూడముచ్చటగా కనిపిస్తాయి. రానురాను విదేశాల్లో కూడా బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా.. తెలంగాణలోని ఆడపచులందరికీ.. మాజీ ఎంపీ కవిత ‘బతుకమ్మ శుభాకాంక్షలు’ […]

మౌనం వీడిన కవితమ్మ.. బతుకమ్మ వీడియోలో ఏం చెప్పారంటే..!
Follow us on

బతుకమ్మ పండుగ రానే వచ్చేసింది. ఆల్రేడీ తెలంగాణ వ్యాప్తంగా.. బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. ఆడపడుచులంతా ఉదయాన్నే సంప్రదాయ దుస్తులు ధరించి, బతుకమ్మలను అలంకరిస్తున్నారు. ముందుగా వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి ఆలయంలో బతుకమ్మ ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించబోతోంది. తెలంగాణలోని అన్ని ప్రాంతాలు.. నేటి నుంచి అక్టోబర్ 6 వరకు రంగు రంగుల బతుకమ్మలతో చూడముచ్చటగా కనిపిస్తాయి. రానురాను విదేశాల్లో కూడా బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు.

ఈ సందర్భంగా.. తెలంగాణలోని ఆడపచులందరికీ.. మాజీ ఎంపీ కవిత ‘బతుకమ్మ శుభాకాంక్షలు’ తెలియజేశారు. తాజాగా.. ఎంపీ కవిత వీడియోలో బతుకమ్మ పాట అయిన.. ‘ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ.. ఏమేమి కాయొప్పునో గౌరమ్మ’ అంటూ పాట పాడారు. కాగా.. కేసీఆర్.. ప్రభుత్వం వచ్చినకాన్నుంచీ.. ‘బతుకమ్మ పండుగ’ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రతీ సంవత్సరం ‘బతుకమ్మ చీరలను’ ఆడపడుచులకు అందిస్తున్నారు.