తహసీల్దార్లకు షాక్ .. ప్రత్యేక బాధ్యతల నుంచి తప్పిస్తూ ఆదేశాలు

| Edited By: Srinu

Jul 10, 2019 | 5:10 PM

నగర పంచాయతీలు,మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న తహసీల్దార్లను వాటి నుంచి తప్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . వీరి స్ధానంలో ఎంపీడీవోలను నియమించింది. తహసీల్దార్లకు వర్క్ టు రూల్ అమల్లోకి తెచ్చి, వీరిని ఈనెల 15 నుంచి సామూహిక సెలవులు పెట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి బ‌దిలీ చేసిన త‌హ‌శీల్దార్ల‌ను తిరిగి పాత జిల్లాల‌కు బ‌దిలీ చేయాల‌ని తెలంగాణ త‌హ‌శీల్దార్ల సంఘం […]

తహసీల్దార్లకు షాక్ .. ప్రత్యేక బాధ్యతల నుంచి తప్పిస్తూ ఆదేశాలు
Follow us on

నగర పంచాయతీలు,మున్సిపాలిటీల్లో ప్రత్యేక అధికారులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న తహసీల్దార్లను వాటి నుంచి తప్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది . వీరి స్ధానంలో ఎంపీడీవోలను నియమించింది. తహసీల్దార్లకు వర్క్ టు రూల్ అమల్లోకి తెచ్చి, వీరిని ఈనెల 15 నుంచి సామూహిక సెలవులు పెట్టాలని కూడా ఆదేశాలు జారీ చేసింది.

ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో భాగంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి బ‌దిలీ చేసిన త‌హ‌శీల్దార్ల‌ను తిరిగి పాత జిల్లాల‌కు బ‌దిలీ చేయాల‌ని తెలంగాణ త‌హ‌శీల్దార్ల సంఘం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే జూలై 9 నుంచి 12 వరకు వర్క్ టు రూల్ ప్రకారం ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు మాత్రమే పనిచేస్తామని ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. అప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన రానిపక్షంలో ఈనెల 15 నుంచి సామూహిక సెలవులు పెడతామని కూడా హెచ్చరించారు.

దీంతో తహసీల్దార్లు ఇచ్చిన అల్టిమేటంను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం వెంటనే వీరిని ప్రత్యేక అధికారుల బాధ్యతలనుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరి స్ధానంలో ఎంపీడీవోలకు బాధ్యతలను కూడా అప్పగించింది.