తొలిరోజే త్రిపుల్ తలాక్ బిల్లు..

| Edited By: Srinu

Jun 21, 2019 | 6:41 PM

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న త్రిపుల్ తలాక్ బిల్లు ఇవాళ లోక్‌సభ ముందుకు రానుంది. తొలిరోజునే ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. కాగా నిన్న ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి పార్లమెంట్‌లో ఇదే అంశంపై ప్రసంగించారు. మహిళా సాధికారత సాధించాలంటే త్రిపుల్ తలాక్, నిఖా హలాలా వంటి ఆచారాలను రూపుమాపాలన్నారు. మన సోదరీమణులు, కుమార్తెలకు గౌరవ ప్రదమైన జీవితాలను అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి సహకారం అందించాలంటూ ఆయన పార్లమెంటు సభ్యులను కోరారు. అయితే ఒకేసారి మూడు సార్లు తలాక్ […]

తొలిరోజే త్రిపుల్ తలాక్ బిల్లు..
Follow us on

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న త్రిపుల్ తలాక్ బిల్లు ఇవాళ లోక్‌సభ ముందుకు రానుంది. తొలిరోజునే ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. కాగా నిన్న ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి పార్లమెంట్‌లో ఇదే అంశంపై ప్రసంగించారు. మహిళా సాధికారత సాధించాలంటే త్రిపుల్ తలాక్, నిఖా హలాలా వంటి ఆచారాలను రూపుమాపాలన్నారు. మన సోదరీమణులు, కుమార్తెలకు గౌరవ ప్రదమైన జీవితాలను అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి సహకారం అందించాలంటూ ఆయన పార్లమెంటు సభ్యులను కోరారు.

అయితే ఒకేసారి మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులిచ్చే పద్ధతిని రద్దు చేస్తూ రూపొందించిన ఈ బిల్లును.. ఇవాళ కేంద్ర న్యాయమంత్రి రవి శంకర్ ప్రసాద్ లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. ఫిబ్రవరిలో ఇదే బిల్లు రాజ్యసభలో వీగిపోవడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.