11 అంకెల ఫోన్ నెంబ‌ర్ విధానం అవాస్త‌వం..ట్రాయ్ క్లారిటీ…

|

May 31, 2020 | 10:27 PM

ఇప్పటివరకు మనం వాడుతున్న‌ ఫోన్ నెంబర్లకు ఏ జిల్లాలో ఉన్నా, ఏ రాష్ట్రమైనా కేవలం 10 నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఇక మీద‌ట కూడా అవే కంటిన్యూ అవుతాయి. ఇక నుంచి మన దేశంలో విడుదల చేయబోయే ఫోన్ నంబర్ల సంఖ్యను 11కు పెంచుతున్నట్టు వ‌చ్చిన వార్త‌ల‌ను టెలికమ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) ఖండించింది. 10-అంకెల నెంబర్ విధానం కొన‌సాగుతుందని స్ప‌ష్టం చేసింది. “మొబైల్ సేవల కోసం 11 అంకెల నంబరింగ్ […]

11 అంకెల ఫోన్ నెంబ‌ర్ విధానం అవాస్త‌వం..ట్రాయ్ క్లారిటీ...
Follow us on

ఇప్పటివరకు మనం వాడుతున్న‌ ఫోన్ నెంబర్లకు ఏ జిల్లాలో ఉన్నా, ఏ రాష్ట్రమైనా కేవలం 10 నెంబర్స్ మాత్రమే ఉంటాయి. ఇక మీద‌ట కూడా అవే కంటిన్యూ అవుతాయి. ఇక నుంచి మన దేశంలో విడుదల చేయబోయే ఫోన్ నంబర్ల సంఖ్యను 11కు పెంచుతున్నట్టు వ‌చ్చిన వార్త‌ల‌ను టెలికమ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ ) ఖండించింది. 10-అంకెల నెంబర్ విధానం కొన‌సాగుతుందని స్ప‌ష్టం చేసింది.

“మొబైల్ సేవల కోసం 11 అంకెల నంబరింగ్ ప్లాన్‌ను ట్రాయ్ సిఫారసు చేసినట్లు కొన్ని మీడియా సంస్థలలో వార్తలు వచ్చాయి. దేశంలో 10-అంకెల నెంబర్ విధానం కొనసాగుతుంది. మేము 11-అంకెల నంబరింగ్ ప్లాన్‌కు మార్చబ‌డుతున్న‌ట్లు వ‌చ్చిన వార్త‌ల‌ను ఖండిస్తున్నాం” అని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది.