శ్రీశైలం ప్రాజెక్టుకు టూరిస్టుల తాకిడి

|

Oct 02, 2020 | 7:38 PM

శ్రీశైలం జలకళను సంతరించకుంది. జలాశయానికి దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు ఐదు రేడియల్‌ క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలను చూసేందుకు తరలివస్తున్నారు. దీంతో ప్రాజెక్టుకు సందర్శకులు పోటెత్తారు.

శ్రీశైలం ప్రాజెక్టుకు టూరిస్టుల తాకిడి
తాజా వివాదంతో వ్యవహారం ఢిల్లీ వరకు వెళ్లింది. సుప్రీంకోర్టుకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది ఏపీ ప్రభుత్వం. ఇప్పటికే కృష్ణా బోర్డుకు మరోసారి ఫిర్యాదు చేసింది తెలంగాణ సర్కార్‌. వెంటనే ఏపీ ప్రాజెక్ట్‌లపై పరిశీలన చేయాలని డిమాండ్‌ చేస్తోంది.
Follow us on

శ్రీశైలం జలకళను సంతరించకుంది. జలాశయానికి దిగువన ఉన్న నాగార్జునసాగర్‌కు ఐదు రేడియల్‌ క్రస్ట్‌ గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్న దృశ్యాలను చూసేందుకు తరలివస్తున్నారు. దీంతో ప్రాజెక్టుకు సందర్శకులు పోటెత్తారు.

మూడు రోజులపాటు సెలవులు రావడంతో జనం శైశలం సుందర దృశ్యాలు చూసేందుకు క్యూ కడుతున్నారు. గాంధీ జయంతి సెలవు.. శని, ఆదివారాలు కలిసి రావడంతో కార్లు, ఇతర వాహనాల్లో అధిక సంఖ్యలో శ్రీశైలం చేరుకుంటున్నారు.

దీంతో శ్రీశైలం జలాశయం రహదారులు సందర్శకుల వాహనాలతో రద్దీగా మారాయి. జలదృశ్యాలను చూసేందుకు వివిధ ప్రాంతాల నుంచి జనం అక్కడికి చేరుకున్నారు. శని, ఆదివారాల్లో సందర్శకుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉంది.