విరిగిపడ్డ కొండచరియలు.. ఐదుగురు మృతి.. 38 మంది మిస్సింగ్

| Edited By:

Aug 14, 2020 | 3:53 PM

నేపాల్‌లో దారుణం చోటుచేసుకుంది. కొండ చరియిలు విరిగిపడి ఐదుగురు మృతి చెందగా.. 8 మంది గాయపడ్డారు. మరో 38 మంది ఆచూకీ లభ్యం కాలేదు. నేపాల్‌లోని సింధుపాల్‌చోక్‌ జిల్లాలో ఈ దుర్ఘటన..

విరిగిపడ్డ కొండచరియలు.. ఐదుగురు మృతి.. 38 మంది మిస్సింగ్
Follow us on

నేపాల్‌లో దారుణం చోటుచేసుకుంది. కొండ చరియిలు విరిగిపడి ఐదుగురు మృతి చెందగా.. 8 మంది గాయపడ్డారు. మరో 38 మంది ఆచూకీ లభ్యం కాలేదు. నేపాల్‌లోని సింధుపాల్‌చోక్‌ జిల్లాలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. అనేక ఇళ్లపై కొండచరియలు విరిగిపడటంతో ఈ సంఘటన చోటుచేసుకుందని.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రెస్క్యూ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతుందన్నారు. శుక్రవారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డట్లు స్థానికులు చెబుతున్నారు. పన్నెండు ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయని.. శిథిలాల కింది నుంచి ఐదు మృతదేహాలను వెలికితీశామని రెస్క్యూ టీం అధికారులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. మరో 38 మంది జాడ తెలియాల్సి ఉందని.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

 

Nepal: 5 bodies found, 8 injured & 38 people missing after a landslide swept houses at around 6:30 am in Sindhupalchowk district.

The landslide collapsed more than a dozen houses in Lidimo Lama Tole, Jugal rural municipality-2 in Sindhupalchok area of North-Central Nepal

— ANI (@ANI) August 14, 2020

Read More :

దంతేవాడలో పెద్ద ఎత్తున లొంగిపోయిన మావోలు

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం