టాప్ 10 న్యూస్.. @10 am

| Edited By:

Jul 20, 2019 | 9:58 AM

1. జగన్ తగ్గకపోతే.. ఏపీలో రాష్ట్రపతి పాలనే : యనమల వార్నింగ్ పీపీఏల విషయంలో రివ్యూలపై జగన్ తన వైఖరిని మార్చుకోకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి  పాలన విధించేందుకు అవకాశం ఉందంటున్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు.కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేస్తే.. Read More 2. ముందు కూతలు.. తరువాత కోతలు ఎందుకో..? : లోకేష్ ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. సీఎం జగన్ నవరత్నాల గురించి ట్విట్టర్‌లో ఎద్దేవా […]

టాప్ 10 న్యూస్.. @10 am
Follow us on

1. జగన్ తగ్గకపోతే.. ఏపీలో రాష్ట్రపతి పాలనే : యనమల వార్నింగ్

పీపీఏల విషయంలో రివ్యూలపై జగన్ తన వైఖరిని మార్చుకోకపోతే రాష్ట్రంలో రాష్ట్రపతి  పాలన విధించేందుకు అవకాశం ఉందంటున్నారు మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు.కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేస్తే.. Read More

2. ముందు కూతలు.. తరువాత కోతలు ఎందుకో..? : లోకేష్

ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర ట్వీట్ చేశారు. సీఎం జగన్ నవరత్నాల గురించి ట్విట్టర్‌లో ఎద్దేవా చేశారు. ఇప్పుడు మీడియా పాయింట్ ఏర్పాటు చేసి.. రాజకీయ విమర్శలు చేయడం తగ్గిపోయాయి.. ట్విట్టర్ అందుబాటులోకి వచ్చాక.. దానిని మన రాజకీయ నాయకులు బాగానే ఉపయోగించుకుంటున్నారు. ‘హాట్ హాట్ ట్వీట్’లు చేసి సోషల్ మీడియాలో డిస్కర్షన్ పెట్టేస్తున్నారు. ప్రజలకు దగ్గరకూడా అవుతున్నారు.

తాజాగా.. నారా లోకేష్.. ‘అసెంబ్లీ సాక్షిగా మరో నవ రత్నం జారిపోయింది. రైతుభరోసా కింద ప్రతి ఏటా రైతులకు రూ.12,500 ఇస్తాం అని ప్రకటించి.. Read More

3. నామినేటెడ్ పదవుల్లో 50 శాతం వారికే.. ఏపీ కేబినెట్ భేటీలో నిర్ణయం

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసేలా ఏపీ ప్రభుత్వం దూకుడుగా వెళుతోంది. శుక్రవారం జరిగిన మంత్రివర్గ భేటీలో పలు కీలక అంశాలను చర్చించి ముసాయిదా బిల్లులకు ఆమోద ముద్ర వేసింది. దీనిలో భాగంగా ప్రభుత్వంలోని అన్ని నామినేటెడ్‌ పోస్టులు, నామినేషన్‌ పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం కేటాయించాలని.. Read More

4. శ్రీలంక కంటే మేమే స్ట్రాంగ్- బంగ్లా ఆల్‌రౌండర్‌ హొసేన్‌

లంక జట్టు కన్నా అన్ని విభాగాల్లో తామే బలంగా ఉన్నామని బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ మొసాద్దెక్‌ హొసేన్‌ అన్నాడు. వచ్చేవారం లంకతో జరగనున్న మూడు వన్డేల సిరీస్‌ నేపథ్యంలో మొసాద్దెక్‌ మాట్లాడాడు. ఇరు జట్ల మధ్య ఇప్పటివరకూ ఏడు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగ్గా అందులో లంక జట్టు ఐదు సిరీస్‌లు గెలిచింది. మరో రెండు సిరీస్‌లు డ్రాగా ముగిశాయి. అయితే ఇటీవలి కాలంలో తమ జట్టు.. Read More

5. ‘మిస్టర్ కేకే’ మూవీ రివ్యూ

కథ :
వాసు (అభి హసన్‌), అధీరా (అక్షరా హసన్) పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకొని మలేషియా వెళ్లిపోతారు. ఓ హాస్పిటల్‌లో డాక్టర్‌ అయిన వాసు, అధీరా గర్భవతి కావటంతో నైట్‌ డ్యూటీస్‌కు వెళుతూ ఉదయం అధీరాకు తోడుగా ఉంటుంటాడు. అదే సమయంలో ఓ ఇండస్ట్రీయలిస్ట్‌ను చంపిన కేసులో ముద్దాయి అయిన కేకే (విక్రమ్‌) అదే హాస్పిటల్‌లో జాయిన్ అవుతాడు. వాసు డ్యూటీలో ఉన్న సమయంలోనే.. Read More

6. లీడర్ కోసం పోటీ..అమ్మాయి చేతిలో ఓటమి..ఆపై ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సాయి చరణ్‌ అనే ఎనిమిదో తరగతి విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. వివర్లాలోకి వెళ్తే.. సాయి చరణ్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. గత బుధవారం (జులై 16) ఆ పాఠశాలలో క్లాస్ లీడర్‌ కోసం.. Read More

7. హైదరాబాద్‌లో కుండపోత వర్షం..!

హైదరాబాద్‌లో రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, దిల్‌సుఖ్ నగర్, సరూర్ నగర్‌, కొత్తపేట, ఎల్బీనగర్‌లో కురిసిన వర్షానికి రోడ్లపై భారీగా వరదనీరు చేరింది. దీంతో..Read More

8. బీహార్,అసోం వరదలతో జనం విలవిల

ఈశాన్య భారతంలో వరదలు బీభత్సం కొనసాగుతోంది. బీహార్, అసోం రాష్ట్రాల్లో ఈ వరదల విలయానికి ఇప్పటి వరకు మృత్యువాతపడ్డవారి సంఖ్య శుక్రవారం నాటికి 139కి పెరిగింది.మరోవైపు అసోంలో వర్షాలు తగ్గుముఖం పట్టినా బ్రహ్మపుత్ర, ధన్‌సిరి, జియా భరాలి, కొపిలి నదులు ఇప్పటికీ .. Read More

9. అరుణా‌చల్‌ ప్రదేశ్‌లో వరుసగా నాలుగు భూకంపాలు

అరుణాచల్ ప్రదేశ్‌లో వరుసగా నాలుగు భూకంపాలు సంభవించాయి. శుక్రవారం ఒక్క రోజే మూడు భూకంపాలు సంభవించగా.. ఈ ఉదయం కూడా మరోసారి భూమి కంపించిందని వాతావారణ శాఖ వెల్లడించింది. వాటి తీవ్రతలు రికార్డు స్కేలుపై 5.5, 5.6, 3.8, 4.9గా ఉన్నాయని వారు పేర్కొన్నారు. అయితే వీటి వలన ఇప్పటివరకు పెద్దగా ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని.. Read More

10. కబడ్డీ.. కబడ్డీ.. ‘ఢీ’ కొట్టుకునేందుకు సిద్ధం..!

హైదరాబాద్ వేదికగా ప్రో కబడ్డి లీగ్ సీజన్-7 స్టార్ట్ అయ్యింది. బరిలో.. 12 జట్లు ఒకరితో మరొకరు తలపడేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచే కబడ్డీ సీజన్ ఆటగాళ్లు ఢీ పడనున్నారు. హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో.. Read More