అయితే ఒలింపిక్స్‌ మేం నిర్వహిస్తాం.. లండన్‌ మేయర్‌ అభ్యర్థి ప్రకటన..!

| Edited By: Team Veegam

Feb 25, 2020 | 6:07 PM

కోవిడ్‌-19 (కరోనా వైరస్) రోజురోజుకీ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది.. చైనాలో ఇప్పటికే క్రీడా కార్యక్రమాలు రద్దు కాగా ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యే వారిపై కూడా ఆంక్షలు విధించింది. ఈ సమయంలో టోక్యోలో జులై 24న జరగబోయే ఒలింపిక్స్‌ నిర్వహణపై కూడా భిన్న వాదనలు మొదలయ్యాయి. ఇటీవల జపాన్‌లోని యెకోహమా తీరంలో నిలిపి ఉంచిన నౌకలో దాదాపు 500మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారించగా.. ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. దీంతో […]

అయితే ఒలింపిక్స్‌ మేం నిర్వహిస్తాం.. లండన్‌ మేయర్‌ అభ్యర్థి ప్రకటన..!
Follow us on

కోవిడ్‌-19 (కరోనా వైరస్) రోజురోజుకీ విజృంభిస్తోంది. చైనాలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గజగజలాడిస్తోంది.. చైనాలో ఇప్పటికే క్రీడా కార్యక్రమాలు రద్దు కాగా ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యే వారిపై కూడా ఆంక్షలు విధించింది. ఈ సమయంలో టోక్యోలో జులై 24న జరగబోయే ఒలింపిక్స్‌ నిర్వహణపై కూడా భిన్న వాదనలు మొదలయ్యాయి. ఇటీవల జపాన్‌లోని యెకోహమా తీరంలో నిలిపి ఉంచిన నౌకలో దాదాపు 500మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారించగా.. ఇద్దరు మరణించిన విషయం తెలిసిందే. దీంతో జపాన్‌లో జరగబోయే ఒలింపిక్స్‌ నిర్వహణపై ఆందోళన వ్యక్తం అవుతోంది.

కొవిడ్‌-19 విజృంభణ కారణంగా చైనీయులను తమ దేశాల్లోకి రానివ్వకుండా ఇప్పటికే పలు దేశాలు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్‌ వేదిక మార్చాల్సి వస్తే నిర్వహించేందుకు సిద్ధమని లండన్‌ మేయర్‌ పదవికి పోటీపడుతున్న కన్జర్వేటివ్‌ అభ్యర్థి షౌన్‌ బైయిలీ ప్రకటించడం విమర్శలు గుప్పిస్తోంది. 2012తో పోలిస్తే ఇప్పుడు క్రీడలు నిర్వహించడానికి కావాల్సిన సౌకర్యాలు మరింత మెరుగుపడ్డాయని.. వేదిక మార్చాల్సి వస్తే లండన్‌ను వేదికగా పరిగణించాలని ఒలింపిక్ కమిటీని విన్నవించాడు.

మరోవైపు, తాను మేయర్‌గా ఎన్నికైతే ఒలింపిక్స్‌ నిర్వహణకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రకటించాడు. దీంతో లండన్‌తో పాటు జపాన్‌లో విమర్శలు వ్యక్తమయ్యాయి. మే7న జరగనున్న లండన్‌ మేయర్‌ ఎన్నిక నేపథ్యంలోనే బైయిలీ ఈ ప్రకటన చేశారని విమర్శిస్తున్నారు. లండన్‌ అధికారులు కూడా ఈ ప్రకటనను కొట్టిపడేయగా..దీనిపై స్పందించిన టోక్యో గవర్నర్‌ ఇది అతనికి అనవసర విషయమని విమర్శించాడు.