Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త… కాస్త తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం ధర ఎంతుందంటే..

Today Gold Price: లాక్‌డౌన్‌ సమయంలో బంగారం ధరలు ఓ రేంజ్‌లో పెరిగాయి. ఒకానొక సమయంలో 10 గ్రాములు బంగారం ధర రూ.55 వేలు దాటింది. అయితే తర్వాత పసిడి పరుగుకు కాస్త బ్రేక్‌ పడుతూ వచ్చింది. అయితే..

Gold Price: పసిడి ప్రియులకు శుభవార్త... కాస్త తగ్గిన బంగారం ధరలు.. ఈరోజు తులం ధర ఎంతుందంటే..

Updated on: Jan 23, 2021 | 7:17 AM

Today Gold Price: లాక్‌డౌన్‌ సమయంలో బంగారం ధరలు ఓ రేంజ్‌లో పెరిగాయి. ఒకానొక సమయంలో 10 గ్రాములు బంగారం ధర రూ.55 వేలు దాటింది. అయితే తర్వాత పసిడి పరుగుకు కాస్త బ్రేక్‌ పడుతూ వచ్చింది. అయితే గత వారం రోజులుగా మరోసారి బంగారం ధరలో పెరుగుదల కనిపించగా.. శనివారం మరోసారి బంగారం ధరకు బ్రేక్‌ పడింది. ఈ రోజు దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం..

దేశ రాజధాని ఢిల్లీలో శనివారం 10 గ్రాములు 22 క్యారెట్ల గోల్డ్‌.. రూ.48,250గా ఉంది. (శుక్రవారంతో పోలీస్తే.. రూ.150 తగ్గింది). ఇక 24 క్యారెట్ల బంగారం రూ. 52,630గా నమోదైంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం రూ. రూ.48,600 (శుక్రవారంత పోలీస్తే.. రూ.50 తగ్గింది) ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర.. రూ.49,550గా నమోదైంది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. హైదరాబాద్‌లో శనివారం 22 క్యారెట్ల తులం బంగారం శుక్రవారంతో రూ. 150 తగ్గి… రూ.46,100గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం విషయంలో మాత్రం 10 గ్రాముల ధర స్వలంగా రూ.10 పెరిగి రూ.50,460గా నమోదైంది. ఇక విజయవాడలో శనివారం 24 క్యారెట్ల తులం బంగారం.. రూ.46,100గా ఉండగా.. 22 క్యారెట్ల గోల్డ్‌ రూ. 50,300గా పలికింది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 46,100గా ఉండగా.. 24 క్యారెట్ల గోల్డ్‌ రూ.50,300గా ఉంది.

Also Read: Budget 2021: కొత్త బడ్జెట్‌పై స్టార్టప్ కంపెనీల ఆశలు.. కార్పొరేట్‌ రంగానికి ఉపశమనం కలిగించేనా..?