టీడీపీకి భారీ ఎదురుదెబ్బ..టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా..!

|

Jan 06, 2020 | 11:24 AM

తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ స్టూడెంట్ విభాగం.. తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి నాదెళ్ల తన పదవికి రాజీనామా చేశాడు. చాలాకాలంగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా ఆయన పార్టీ వాయిస్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్లే తన పదవి రాజీనామా చేశానని చెప్పిన బ్రహ్మం చౌదరి..సాధారణ కార్యకర్తగా పార్టీలో కొనసాగుతానని తెలిపాడు. మిడిల్ క్లాస్ […]

టీడీపీకి భారీ ఎదురుదెబ్బ..టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా..!
Follow us on

తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ స్టూడెంట్ విభాగం.. తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి నాదెళ్ల తన పదవికి రాజీనామా చేశాడు. చాలాకాలంగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నారు. గతంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా ఆయన పార్టీ వాయిస్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాడు. అయితే వ్యక్తిగత కారణాల వల్లే తన పదవి రాజీనామా చేశానని చెప్పిన బ్రహ్మం చౌదరి..సాధారణ కార్యకర్తగా పార్టీలో కొనసాగుతానని తెలిపాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తనను పార్టీ అధినేత చంద్రబాబు ముందుండి నడిపించారని..ఆయన ప్రోత్సాహం మర్చిపోలేనని పేర్కొన్నాడు. బ్రహ్మం..టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడనే పేరుంది. నిన్న, మొన్నటివరకు  పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్న బ్రహ్మం చౌదరి..ఒక్కసారిగా రాజీనామా చేయడంతో చర్చనీయాంశమైంది.