సెప్టెంబరు 19 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు..!

| Edited By:

Aug 08, 2020 | 8:43 PM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది అధికమాసం నేపథ్యంలో శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.

సెప్టెంబరు 19 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు..!
Follow us on

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఏడాది అధికమాసం నేపథ్యంలో శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. సెప్టెంబరు 19 నుంచి 27 వరకు శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని టీటీడీ అధికారులు ప్రకటించారు. సెప్టెంబరు 18న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. సెప్టెంబర్ 23న గరుడ సేవ,2 4 స్వర్ణ రథం, 26న రథోత్సవం, 27 చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

తిరిగి అక్టోబర్ 16 నుంచి 24వ తేది వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అక్టోబరు 20వ తేదిన గరుడ సేవ, 21న పుష్ప పల్లకి, 23న స్వర్ణ రథం, 24న చక్రస్నానంతో ఉత్సవాలు ముగియనున్నాయి. కరోనా కారణంగా ఏకాంతంగా నిర్వహించేందుకే టీటీడీ మొగ్గు చూపుతోంది. ఉత్సవాల నిర్వహణపై ఇప్పటికే ఆగమసలహాదారులను టీటీడీ సంప్రదించింది. నెలాఖరున పాలకమండలి సమావేశంలో ఉత్సవాల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటారు.

Read More:

ఏపీలోని ఆ జిల్లాల్లో.. మరోసారి కఠిన లాక్‌డౌన్..?

జగన్ కీలక నిర్ణయం.. సామాజిక ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్‌ బెడ్స్..!