వైభవంగా శ్రీవారి సాలకట్ల ఆణివార ఆస్థానం

|

Jul 16, 2020 | 7:39 PM

తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానంను వైభవంగా జరిగింది. తమిళనాడులోని శ్రీరంగం ఆలయం నుంచి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను ఊరేగింపుగా స్వామివారి సన్నిధికి...

వైభవంగా శ్రీవారి సాలకట్ల ఆణివార ఆస్థానం
Follow us on

Salakatala Aanivara Astanam : తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆణివార ఆస్థానంను వైభవంగా జరిగింది. తమిళనాడులోని శ్రీరంగం ఆలయం నుంచి తీసుకువచ్చిన పట్టు వస్త్రాలను ఊరేగింపుగా స్వామివారి సన్నిధికి తీసుకొచ్చారు. అనంతరం ఆలయంలోని బంగారు వాకిలి వద్ద ఘంటా మండపంలో ఉభయ నాంచారులతో కూడిన మలయప్పస్వామివారిని గరుత్మంతునికి అభిముఖంగా ఆశీనులు చేసి పాలు, తేనె, పచ్చ కర్పూరం, సుగంధమైన పరిమళాలతో అభిషేకాలు నిర్వహించారు.

ఆ తర్వాత పెద్ద జీయంగార్‌ పెద్ద వెండి తాంబాళంలో ఆరు పట్టువస్త్రాలను మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా  శ్రీవారికి సమర్పిస్తారు. ఇందులో నాలుగు పట్టు వస్త్రాలను మూలవిరాట్టుకు అలంకరించారు. మిగిలిన రెండు పట్టు వస్త్రాలలో ఒకటి మలయప్పస్వామివారికి, మరొకటి విశ్వక్షేనుడుకి అలంకరించారు.

ఇక శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు తలకు ”పరివట్టం” కట్టుకొని స్వామివారి ద్వారా దక్షిణ స్వీకరించి ‘నిత్యైశ్వర్యోభవ’ అని స్వామివారిని ఆశీర్వదించారు.  ఆ తర్వాత అర్చకులు పెద్ద జీయంగార్, చిన్న జీయంగారుకు టీటీడీ తరఫున సీఈఓ అనిల్‌కుమార్‌ సింఘాల్‌కు ‘లచ్చన’ అను తాళపు చెవి గుత్తిని వరుస క్రమంలో కుడిచేతికి తగిలించారు. హారతి, చందనం, తాంబూలం, తీర్థం, శఠారి మర్యాదలు చేసిన అనంతరం ఆ తాళపు చెవి గుత్తిని శ్రీవారి పాదాలచెంత ఉంచారు. దీంతో సాలకట్ల ఆణివార ఆస్థానం ముగిసింది.