Jagan add న్యూయార్క్‌లో జగన్ ప్రకటన… సీక్రెట్ ఇదేనన్న ఎన్ఆర్ఐ

| Edited By: Anil kumar poka

Apr 04, 2020 | 2:00 PM

నాలుగు రోజుల క్రితం న్యూయార్క్ సిటీ టైమ్ స్క్వేర్‌లో ప్రసారమైన ఏపీ ప్రభుత్వ ప్రకటనపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. రాష్ట్రంలో జనం లాక్ డౌన్ తో పడుతున్న ఇబ్బందులను నివారించకుండా.. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు చర్యలు తీసుకోకుండా.. న్యూయార్క్ ఆర్భాటపు ప్రచారం చేసుకుంటున్నారంటూ తెలుగు దేశం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

Jagan add న్యూయార్క్‌లో జగన్ ప్రకటన... సీక్రెట్ ఇదేనన్న ఎన్ఆర్ఐ
Follow us on

Advertisement controversy: నాలుగు రోజుల క్రితం న్యూయార్క్ సిటీ టైమ్ స్క్వేర్‌లో ప్రసారమైన ఏపీ ప్రభుత్వ ప్రకటనపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. రాష్ట్రంలో జనం లాక్ డౌన్ తో పడుతున్న ఇబ్బందులను నివారించకుండా.. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు చర్యలు తీసుకోకుండా.. న్యూయార్క్ ఆర్భాటపు ప్రచారం చేసుకుంటున్నారంటూ తెలుగు దేశం నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీలో రాజకీయ దుమారం నెలకొన్న తరుణంలో అసలు నిజమేంటో చెబుతూ వెలుగులోకి వచ్చారు అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్.

‘‘న్యూయార్క్‌ నగరంలోని టైమ్స్‌ స్క్వేర్‌లో ఇచ్చిన ప్రకటన నా సొంత ఖర్చులతో ఏర్పాటు చేసింది.. ఈ ప్రకటనకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు.. న్యూయార్క్‌ టైమ్స్‌ స్క్వేర్‌ ప్రకటన ద్వారా ప్రవాసాంధ్రులకు సీఎం వైయస్‌ జగన్‌ సందేశాన్ని తెలియ జేశాను..’’ అంటూ వివరించారు పండుగాయ రత్నాకర్. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నేతల ఆరోపణలపై ఆయన విరుచుకుపడ్డారు. ‘‘తెలుగువారిలో ధైర్యాన్ని నింపే ఒక మంచి ప్రయత్నంపై దుష్ప్రచారానికి దిగి టీడీపీ తన వక్రబుద్ధిని మరోసారి చాటుకుంది.. ధర్నాల పేరుతో గతంలో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వనియోగం చేశారు టీడీపీ నేతలు.. దుబారా ఖర్చులతో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టింది ’’ అంటూ విమర్శలు గుప్పించారు.

టైమ్స్‌ స్క్వేర్‌ ప్రకటన కోసం కోట్లాది రూపాయల ప్రభుత్వ నిధులు ఖర్చుచేసినట్లు సామాజిక మాధ్యమాల్లో టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించింని రత్నాకర్.. తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై త్వరలోచట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.