మరోసారి పెద్ద పులి కలకలం.. హడలిపోతున్న కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాసులు.. చర్యలు తీసుకోవాలంటూ వేడుకోలు..

|

Nov 30, 2020 | 9:15 AM

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. తాజాగా జిల్లాలోని..

మరోసారి పెద్ద పులి కలకలం.. హడలిపోతున్న కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాసులు.. చర్యలు తీసుకోవాలంటూ వేడుకోలు..
Follow us on

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. తాజాగా జిల్లాలోని పెంచికల్ పేట మండలం కొండపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరించడాన్ని గ్రామస్తులు కొందరు గమనించారు. ఆదివారం నాడు వ్యవసాయ క్షేత్రంలో పని చేసుకుంటున్న నిర్మల అనే యువతిపై పులి దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. నిర్మల మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తుండగా పులి ఎదురైంది. దీంతో అంబులెన్స్‌లోని వారు హడలిపోయారు. పులి సంచారం కారణంగా అక్కడి ప్రజలు ఇళ్ల నుండి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. పులిని బంధించి తమ ప్రాణాలను కాపాడాలని అధికారులకు గ్రామస్తులు మొర పెట్టుకుంటున్నారు. కాగా, పులిని బంధించేందుకు అటవీ అధికారులు రంగంలోకి దిగారు. పులిదాడి చేసిన ప్రాంతంలో కెమెరాలతో పాటు బోనులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇదిలాఉండగా, పులి దాడిలో మృతి చెందిన నిర్మల కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారంతో పాటు ఆమె కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వనున్నట్లు జిల్లా అధికార యంత్రాంగం ప్రకటించిన విషయం తెలిసిందే.