మంచిర్యాల జిల్లా వాసులకు పులి భయం, పొలం పనులకు వెళ్లాలంటే టెన్షన్..టెన్షన్

|

Dec 06, 2020 | 8:30 AM

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులను పులి భయం వెంటాడుతోంది. అడ్డు వస్తున్న పశువుల మీద మనుషుల మీద దాడులు చేస్తోంది. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా....

మంచిర్యాల జిల్లా వాసులకు పులి భయం, పొలం పనులకు వెళ్లాలంటే టెన్షన్..టెన్షన్
Follow us on

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావాసులను పులి భయం వెంటాడుతోంది. అడ్డు వస్తున్న పశువుల మీద మనుషుల మీద దాడులు చేస్తోంది. కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పెంచికల్ పేట్ మండలం కొండపల్లి గ్రామంలో నిర్మలపై దాడి చేసి మాయం అయిన పులి ఆ తరువాత కనిపించకుండా పోయింది. తాజాగా మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం నక్కలపల్లి గ్రామ శివారులో పులి సంచారం కలకలం రేపింది.

రోడ్డుపై వెళుతున్న వాహనదారులకు పులి కనిపించడంతో భయంతో బైకులను వదిలేసి పరుగులు తీసారు. అటవి సమీపంలో పెద్దపులి భారీ నుండి ప్రజలను కాపాడేందుకు రక్షణ చర్యలను విసృతం చేసారు. పులి‌దాడి జరిగిన కొండపల్లి గ్రామంలో పత్తి రైతులకు, పత్తి తీసే కూలీలుకు మనుషులను పోలిన వంద మాస్క్‌లను పంపిణీ చేసారు‌. కూలీలు వెనకబాగంలో ఈ మనిషిని పోలిన మాస్క్ పెట్టుకోని పనికి వెళ్తే పులి దగ్గరకు రాదని ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు.

Also Read :  గ్రేటర్‌లో కాషాయం రెపరెపలు..ఏపీ నేతల్లో ఉత్సాహాం, తిరుపతి ఉపఎన్నికపై ఫోకస్ !