ములకలపల్లి మండలంలో పెద్ద పులి అలికిడి.. వణికిపోతున్న ప్రజలు.. స్పష్టత లేదంటున్న అధికారులు

|

Dec 23, 2020 | 7:20 PM

ఇటీవల కాలంలో పులుల సంచారం ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తాజాగా భద్రాది కొత్తగూడం జిల్లాలో పులిసంచారం ..

ములకలపల్లి మండలంలో పెద్ద పులి అలికిడి.. వణికిపోతున్న ప్రజలు.. స్పష్టత లేదంటున్న అధికారులు
Follow us on

ఇటీవల కాలంలో పులుల సంచారం ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.  ప్రజావాసంలోకి వస్తున్న వన్యప్రాణులు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా భద్రాది కొత్తగూడం జిల్లాలో పెద్ద పులిసంచారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. జిల్లాలోని ములకలపల్లి మండలంలో పెద్ద పులి అలికిడికి  గ్రామస్థులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ములకలపల్లి మండలంలోని కమలాపురంలో పులి అలికిడిని గుర్తించారు. పాల్వంచ నుంచి కమలాపురం వైపు కారులో వస్తున్న ప్రయాణికులు పులిని గుర్తించినట్లు తెలుస్తున్నది. అంతకుముందే గుట్టగూడెం-మామిళ్లగూడెం మధ్య ఉన్న పంట పొలంలో మంగళవారం ఓ మహిళ పులి సంచారాన్ని గుర్తించింది. మరో వ్యక్తి ఇదే మార్గంలో పులిని గుర్తించాడని భయంతో గ్రామంలోకి పరుగులు తీసాడని తెలిసింది. దాంతో ఆ పరిసరాల్లో ఉన్న కమలాపురం, మామిళ్లగూడెం, గుట్టగూడెం, మూకమామిడి, ఎర్రప్పగుంపు, ముత్యాలంపాడు గ్రామాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సర్పంచులు కోరుతున్నారు. అటవీశాఖ అధికారులకు పులి సంచారం పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేకపోతున్నారు.