జాతీయ రహదారిపై పెద్దపులి… తరువాత ఏం జరిగిందంటే..!

| Edited By:

Feb 09, 2020 | 12:17 AM

నేషనల్‌ హైవే పై పెట్రోలింగ్‌ కోసం వెళ్లిన జుక్కల్‌ పోలీసులకు పెద్దపులి కనిపించడంతో 15 నిమిషాల పాటు వాహనాన్ని రోడ్డుపై నిలిపివేశారు. ఈ ఘటన నాందేడ్‌-సంగారెడ్డి జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి పెద్దకొడప్‌గల్‌, బిచ్కుంద మండలాల పరిధిలోని శాంతాపూర్‌ గండి పరిసరాల్లో చోటుచేసుకుంది. పెద్దపులి రోడ్డు దాటేంత వరకు పోలీసులు వాహనంలోనే ఉన్నారు. జుక్కల్, బిచ్కుంద, పెద్దకొడప్‌గల్‌ మండలాల్లోని అడవుల్లో రాత్రి వేళ ప్రయాణించే ద్విచక్రవాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని జుక్కల్‌ ఎస్సై ఎండీ. రఫీయోద్దిన్‌ సూచించారు. జాతీయ […]

జాతీయ రహదారిపై పెద్దపులి... తరువాత ఏం జరిగిందంటే..!
Follow us on

నేషనల్‌ హైవే పై పెట్రోలింగ్‌ కోసం వెళ్లిన జుక్కల్‌ పోలీసులకు పెద్దపులి కనిపించడంతో 15 నిమిషాల పాటు వాహనాన్ని రోడ్డుపై నిలిపివేశారు. ఈ ఘటన నాందేడ్‌-సంగారెడ్డి జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి పెద్దకొడప్‌గల్‌, బిచ్కుంద మండలాల పరిధిలోని శాంతాపూర్‌ గండి పరిసరాల్లో చోటుచేసుకుంది. పెద్దపులి రోడ్డు దాటేంత వరకు పోలీసులు వాహనంలోనే ఉన్నారు. జుక్కల్, బిచ్కుంద, పెద్దకొడప్‌గల్‌ మండలాల్లోని అడవుల్లో రాత్రి వేళ ప్రయాణించే ద్విచక్రవాహనదారులు జాగ్రత్తలు తీసుకోవాలని జుక్కల్‌ ఎస్సై ఎండీ. రఫీయోద్దిన్‌ సూచించారు. జాతీయ రహదారిపై పెద్దపులి సంచరించడంతో ప్రయాణికులు, వాహనదారులు ఆందోళన చెందుతున్నారు.