భారత్‌లో ఎమిరేట్స్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్

| Edited By:

Apr 26, 2019 | 4:23 PM

యూఏఈ ప్రభుత్వం మన టీచర్లకు రూ.3 లక్షలకు పైగా జీతం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎమిరేట్స్ గవర్నమెంట్‌ వారి దేశంలోని ప్రభుత్వ స్కూళ్లలో పనిచేయడానికి దాదాపు 3,000 మంది టీచర్లను నియమించుకుంటోంది. ముంబై, ఢిల్లీ నగరాల్లో నియామక ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. టీచర్ల ఎంపికకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.3 లక్షలకు పైగా జీతం లభించనుంది. భారత్‌లోని టీచర్ల వేతనాల సగటుతో పోలిస్తే ఈ జీతం దాదాపు 10 రెట్లు ఎక్కువ కావడం […]

భారత్‌లో ఎమిరేట్స్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్
Follow us on

యూఏఈ ప్రభుత్వం మన టీచర్లకు రూ.3 లక్షలకు పైగా జీతం ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎమిరేట్స్ గవర్నమెంట్‌ వారి దేశంలోని ప్రభుత్వ స్కూళ్లలో పనిచేయడానికి దాదాపు 3,000 మంది టీచర్లను నియమించుకుంటోంది. ముంబై, ఢిల్లీ నగరాల్లో నియామక ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తోంది. టీచర్ల ఎంపికకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.3 లక్షలకు పైగా జీతం లభించనుంది. భారత్‌లోని టీచర్ల వేతనాల సగటుతో పోలిస్తే ఈ జీతం దాదాపు 10 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

యూఏఈ ప్రభుత్వం ఎంపికైన అభ్యర్థుల కుటుంబాల కోసం కొత్త వీసా నిబంధనలను కూడా తీసుకురావాలని చూస్తోంది. యూఏఈలో ప్రైవేట్ స్కూళ్లతో గవర్నమెంట్ స్కూళ్లు ఏమాత్రం పోటీపడలేకపోతున్నాయి. అందుకే అక్కడి ప్రభుత్వం పరిస్థితులను చక్కదిద్దేందుకు తగిన చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే కొత్తగా టీచర్లను నియమించుకుంటోంది.