పుల్వామా దాడి పాకిస్థాన్ పనే.. తేల్చి చెప్పిన ఎన్‌ఐఏ

| Edited By: Srinu

Mar 07, 2019 | 4:32 PM

పుల్వామా దాడి పాక్ పనేనని ఎన్ఐఏ తేల్చిచెప్పింది. పుల్వామా ఉగ్రదాడిపై విచారణ జరుపుతున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇందులో పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు నిర్ధారించింది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఆదిల్ దార్ తో పాటు కనీసం నలుగురైదుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఈ ఆపరేషన్ లో పాలుపంచుకున్నట్లు సాక్ష్యాధారాలు లభించాయని ఎన్ఐఏ వెల్లడించింది. ఈ దాడిలో మారుతి ఈకో వాహనాన్ని వాడినట్లు గుర్తించారు. ఈ వాహనం ఎనిమదేళ్ల కింద కశ్మీర్ లోనే రిజిస్టర్ అయింది. అయితే ఉగ్రవాదుల […]

పుల్వామా దాడి పాకిస్థాన్ పనే.. తేల్చి చెప్పిన ఎన్‌ఐఏ
Follow us on

పుల్వామా దాడి పాక్ పనేనని ఎన్ఐఏ తేల్చిచెప్పింది. పుల్వామా ఉగ్రదాడిపై విచారణ జరుపుతున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఇందులో పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు నిర్ధారించింది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఆదిల్ దార్ తో పాటు కనీసం నలుగురైదుగురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు ఈ ఆపరేషన్ లో పాలుపంచుకున్నట్లు సాక్ష్యాధారాలు లభించాయని ఎన్ఐఏ వెల్లడించింది. ఈ దాడిలో మారుతి ఈకో వాహనాన్ని వాడినట్లు గుర్తించారు. ఈ వాహనం ఎనిమదేళ్ల కింద కశ్మీర్ లోనే రిజిస్టర్ అయింది. అయితే ఉగ్రవాదుల తన వాహనాన్ని వాడుతున్నట్లు వాహన యజమానికి కూడా తెలుసునని.. దాడి జరిగిన తర్వాత అతడు కనిపించకుండా పోయాడని ఎన్ఐఏ తేల్చింది. ఈ దాడిలో పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తున్నదని ఎన్ఐఏ అధికారి ఒకరు వెల్లడించారు.

దాడి చేసిన వాహనంలో ఆర్డీఎక్స్‌ను నింపినట్లు తేలింది. ఈ ఆర్డీఎక్స్ జేఈఎం ఉగ్రవాదులకు ఎలా చేరిందన్నదానిపై విచారణ ఇంకా కొనసాగుతున్నది. సరిహద్దు అవతలి నుంచే ఈ ఆర్డీఎక్స్ వచ్చినట్లు విచారణాధికారులు అనుమానిస్తున్నారు. గతేడాది మార్చిలో కనిపించకుండా పోయిన అహ్మద్ దార్ అప్పటి నుంచీ జైషేతోనే ఉన్నాడనీ ఎన్‌ఐఏ తేల్చింది. గతేడాది జూన్‌లో సీఆర్పీఎఫ్ జవాన్లు తన ఇంటిని తగులబెట్టడానికి ప్రయత్నించినప్పటి నుంచీ ఆదిల్ అహ్మద్ దార్ వాళ్లపై కక్ష పెంచుకున్నట్లు కూడా విచారణలో తేలింది. ఈ ఘటన జరిగిన వెంటనే జూన్ 2న భద్రతా బలగాలపై జైషే ఉగ్రవాదులు గ్రెనేడ్ దాడులకు పాల్పడ్డారు. దీనికి ఆపరేషన్ బదర్ అనే పేరు కూడా పెట్టారు.