ముస్లింలు ఉగ్రవాదులు కాదు… వారిని అలా చూడొద్దు: శ్రీలంక అధ్యక్షుడు

|

Apr 26, 2019 | 4:34 PM

శ్రీలంకలో ఆదివారం ఈస్టర్ పండుగ నాడు ఉగ్రవాదులు చర్చిలు, హోటళ్లపై ఆత్మాహుతి దాడులు చెయ్యడం…వందల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు తీసుకోవడం.. వాటి వెనక తామే ఉన్నామని ఐసిస్ ప్రకటించడం… న్యూజిలాండ్‌లో ముస్లింలపై దాడులకు నిరసనగా ఈ దాడులు చేసినట్లు చెప్పడంతో… సహజంగానే శ్రీలంకలో ముస్లింలపై ఒక రకమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ పరిస్థితిని గమనించిన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన… తమ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో మైనార్టీ వర్గంగా ఉన్న ముస్లింలను ఉగ్రవాదులుగా చూడొద్దని […]

ముస్లింలు ఉగ్రవాదులు కాదు... వారిని అలా చూడొద్దు: శ్రీలంక అధ్యక్షుడు
Follow us on

శ్రీలంకలో ఆదివారం ఈస్టర్ పండుగ నాడు ఉగ్రవాదులు చర్చిలు, హోటళ్లపై ఆత్మాహుతి దాడులు చెయ్యడం…వందల సంఖ్యలో అమాయకులు ప్రాణాలు తీసుకోవడం.. వాటి వెనక తామే ఉన్నామని ఐసిస్ ప్రకటించడం… న్యూజిలాండ్‌లో ముస్లింలపై దాడులకు నిరసనగా ఈ దాడులు చేసినట్లు చెప్పడంతో… సహజంగానే శ్రీలంకలో ముస్లింలపై ఒక రకమైన వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ పరిస్థితిని గమనించిన శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన… తమ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. దేశంలో మైనార్టీ వర్గంగా ఉన్న ముస్లింలను ఉగ్రవాదులుగా చూడొద్దని కోరారు. దాడుల పేరుతో మత కల్లోలాలు సృష్టించవద్దని పిలుపునిచ్చారు. ఐసిస్ ఉగ్రవాదుల చర్యల్ని పూర్తి స్థాయిలో అడ్డుకునే శక్తి సామర్ధ్యాలు తమకు ఉన్నాయన్నారు.