నేతలన్నలను ఆదుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్

|

May 26, 2020 | 5:18 PM

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ హైకోర్టులో పిల్ దా‌ఖ‌లైంది. హైకోర్టు న్యాయవాది ధాఖలు చేసిన ఈ పిల్ ను కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. కరోనావైరస్ అన్ని రంగాలను దెబ్బతీసింది. లాక్ డౌన్ కారణంగా చేనేత కార్మికులు ఆర్థికంగా చితికిపోయారు. నేతన్నలు.. తమ కుటుంబాలను ఆదుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7 లక్షల మంది చేనేత కార్మికులు గత మూడు నెలలుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని […]

నేతలన్నలను ఆదుకోవాలంటూ హైకోర్టులో పిటిషన్
Follow us on

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ హైకోర్టులో పిల్ దా‌ఖ‌లైంది. హైకోర్టు న్యాయవాది ధాఖలు చేసిన ఈ పిల్ ను కోర్టు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది.
కరోనావైరస్ అన్ని రంగాలను దెబ్బతీసింది. లాక్ డౌన్ కారణంగా చేనేత కార్మికులు ఆర్థికంగా చితికిపోయారు. నేతన్నలు.. తమ కుటుంబాలను ఆదుకోవాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 7 లక్షల మంది చేనేత కార్మికులు గత మూడు నెలలుగా ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారని పిటిష‌న‌ర్ త‌న పిటీషన్ లో పేర్కొన్నారు. ఇప్పటికే 200 కోట్ల విలువైన ముడి సరుకు కార్మికుల వద్ద సిద్దంగా ఉందని, ఆ సరుకును మొత్తం ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోర్టుకు విన్నవించారు. లాక్ డౌన్ సమయంలో ఉపాధి లేని చేనేత కార్మికులకు నెలకు 30 వేల రూపాయలు ప్రభుత్వం చేత ఇప్పించాలని కోరారు. చనిపోయిన చేనేత కార్మికుల కు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని పిటిష‌నర్ కోరారు.
దీనిపై విచార‌ణ జరిపిన హైకోర్టు.. చేనేత కార్మికుల పై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పూర్తి వివరాలను జూన్ 5 లోపు నివేద‌క ద్వారా సమర్పించాలని ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 5 కు వాయిదా వేసింది.