ఎర్రమంజిల్ భవనం కూల్చివేత కేసు .. తీర్పును రిజర్వ్‌లో ఉంచిన కోర్టు

| Edited By:

Aug 07, 2019 | 6:08 PM

ఎర్రమంజిల్ భవనం కూల్చివేతపై హైకోర్టులో జరుగుతున్న వాదనలు ముగిశాయి. జూలై 3 నుంచి జరుగుతున్న వాదనల్లో ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది . తెలంగాణలో నూతన అసెంబ్లీ నిర్మాణం కోసం ఎర్రమంజిల్ భవనాలు కూల్చివేయాలని ప్రభుత్వం భావించింది. అయితే 2010లో హెచ్ఎండీఏ సమర్పించిన మాస్టర్ ప్లాన్‌లో పురాతన కట్టడంగా ఈ భవనం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే కూల్చివేతపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 183 చట్టవిరుద్దమని, రెగ్యులేషన్ చేసే అవకాశం ప్రభుత్వానికి లేదని […]

ఎర్రమంజిల్ భవనం కూల్చివేత కేసు .. తీర్పును రిజర్వ్‌లో ఉంచిన కోర్టు
Follow us on

ఎర్రమంజిల్ భవనం కూల్చివేతపై హైకోర్టులో జరుగుతున్న వాదనలు ముగిశాయి. జూలై 3 నుంచి జరుగుతున్న వాదనల్లో ఇరువైపులా వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచింది . తెలంగాణలో నూతన అసెంబ్లీ నిర్మాణం కోసం ఎర్రమంజిల్ భవనాలు కూల్చివేయాలని ప్రభుత్వం భావించింది. అయితే 2010లో హెచ్ఎండీఏ సమర్పించిన మాస్టర్ ప్లాన్‌లో పురాతన కట్టడంగా ఈ భవనం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. అయితే కూల్చివేతపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 183 చట్టవిరుద్దమని, రెగ్యులేషన్ చేసే అవకాశం ప్రభుత్వానికి లేదని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు ఎదుట వాదనలు వినిపించారు. కాగా చారిత్రక కట్టడాల జాబితాను రద్దు చేస్తూ ప్రభుత్వం 183 జీవో ఇచ్చింది.