Thala Dhoni: ధోనికి బీసీసీఐ డెడ్ లైన్.. అదే లాస్ట్ ఛాన్స్ అంటూ…

| Edited By:

Mar 09, 2020 | 10:38 PM

Thala Dhoni Re Entry: క్రికెట్ ఫ్యాన్స్ భారత్ మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని రీ-ఎంట్రీపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ విషయంపై తాజాగా కొత్త సెలక్షన్ కమిటీ క్లారిటీ ఇచ్చేసింది. ఐపీఎల్ ఫామ్ ధోని భవిష్యత్తును నిర్ణయిస్తుందని బీసీసీఐ సెలక్షన్ కమిటీ హెడ్ సునీల్ జోషి స్పష్టం చేశారు. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోని.. ఐపీఎల్ 2020తో తన ఫామ్‌ను మరోసారి […]

Thala Dhoni: ధోనికి బీసీసీఐ డెడ్ లైన్.. అదే లాస్ట్ ఛాన్స్ అంటూ...
Follow us on

Thala Dhoni Re Entry: క్రికెట్ ఫ్యాన్స్ భారత్ మాజీ కెప్టెన్ మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని రీ-ఎంట్రీపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ విషయంపై తాజాగా కొత్త సెలక్షన్ కమిటీ క్లారిటీ ఇచ్చేసింది. ఐపీఎల్ ఫామ్ ధోని భవిష్యత్తును నిర్ణయిస్తుందని బీసీసీఐ సెలక్షన్ కమిటీ హెడ్ సునీల్ జోషి స్పష్టం చేశారు.

గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్‌కప్ నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న ధోని.. ఐపీఎల్ 2020తో తన ఫామ్‌ను మరోసారి రాబట్టుకోవాలని చూస్తున్నాడు. ఇప్పటికే చెన్నైలోని చపాక్ స్టేడియంలో ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టేసింది విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే తాజాగా కొత్తగా నియామకమైన చీఫ్ సెలెక్టర్ సునీల్ జోషి నేతృత్వంలో ఈ నెల 12 నుంచి జరగబోయే సఫారీ సిరీస్‌కు భారత్ జట్టును ఎంపిక చేశారు. ధావన్, హార్దిక్ పాండ్యలు రీ-ఎంట్రీ ఇస్తుండగా.. హిట్‌మ్యాన్ ఇంకా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే సమయంలో సెలక్టర్లు, బీసీసీఐ పెద్దల మధ్య ధోని ప్రస్తావన వచ్చినట్లు సమాచారం.

‘దక్షిణాఫ్రికా సిరీస్‌ కోసం జట్టును ఎంపిక చేసే సమయంలో ధోని పేరు ప్రస్తావనకు రాలేదని.. అతడి భవిష్యత్తు ఐపీఎల్ 2020 ఫామ్‌తోనే తేలుతుందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ధోని నిలకడగా రాణిస్తేనే జట్టులోకి రీ-ఎంట్రీ ఇవ్వగలడని.. అతడిలా ఇంకా చాలామంది క్రికెటర్లు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పుకొచ్చాడు. ఒకవేళ ధోని కంటే ఇంకెవరైనా మెరుగైన ఆటతీరును కనబరిస్తే వారిని జట్టులోకి తీసుకోవచ్చునని బీసీసీఐ అధికారి వెల్లడించాడు.

For More News:

మోదీ డ్రీమ్ టీమ్‌లో హైదరాబాదీ.. అసలు ఆమెవరు.? బ్యాగ్రౌండ్ ఏంటి.?

‘ఆహా’కు వెల్లువెత్తిన రిజిస్ట్రేషన్లు.. లక్షల్లో ‘వ్యూ’లు..

బాయ్‌ఫ్రెండ్‌తో రొమాన్స్.. తల్లి ఎంట్రీ‌తో కూతురు షాక్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.?

కరోనా భయం.. కోహ్లీసేనతో నో షేక్ హ్యాండ్..

అల్లరోడుతో చందమామ రొమాన్స్..?

కరోనా ఎఫెక్ట్.. హద్దు దాటితే మూడు నెలల జైలు శిక్ష..

కొన్నిసార్లు మన కళ్లే మోసం చేస్తాయట.. దొరబాబు భార్య సందేశం

జగన్ సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీలో 17 రోజులు మద్యం దుకాణాలు బంద్..

దిశ నిందితుడు చెన్నకేశవులు తండ్రి మృతి…