యునెస్కో జాబితాలో చోటు సంపాదించిన ‘థాయ్ మసాజ్‌’

|

Dec 15, 2019 | 8:40 AM

ప్రపంచ వ్యాప్తంగా చాలా రకాలు మసాజ్‌లు ఉన్నాయి. అందులో థాయ్ మసాజ్ సమ్‌థింగ్ స్పెషల్.  ఈ మసాజ్‌లో నూనెలు, లోషన్లు ఉపయోగించరు. ఇతర రకాల మసాజ్ మాదిరిగానే కాకుండా..   ముంజేయి, మోకాలుతో కండరాలపై  కుదించడం, లాగడం, సాగదీయడం వంటి ప్రక్రియలు కూడా దీనిలో భాగంగా ఉంటాయి. ఇప్పుడు థామ్ మసాజ్ ఓ స్పెషల్ గుర్తింపును దక్కించుకుంది.  దీనికి ప్రతిష్ఠాత్మక యునెస్కో  సాంస్కృతిక జాబితాలో చోటు దక్కింది. ప్రాంతాలకు రక్షణ కల్పించే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల మాదిరిగానే […]

యునెస్కో జాబితాలో చోటు సంపాదించిన  థాయ్ మసాజ్‌
Follow us on

ప్రపంచ వ్యాప్తంగా చాలా రకాలు మసాజ్‌లు ఉన్నాయి. అందులో థాయ్ మసాజ్ సమ్‌థింగ్ స్పెషల్.  ఈ మసాజ్‌లో నూనెలు, లోషన్లు ఉపయోగించరు. ఇతర రకాల మసాజ్ మాదిరిగానే కాకుండా..   ముంజేయి, మోకాలుతో కండరాలపై  కుదించడం, లాగడం, సాగదీయడం వంటి ప్రక్రియలు కూడా దీనిలో భాగంగా ఉంటాయి. ఇప్పుడు థామ్ మసాజ్ ఓ స్పెషల్ గుర్తింపును దక్కించుకుంది. 

దీనికి ప్రతిష్ఠాత్మక యునెస్కో  సాంస్కృతిక జాబితాలో చోటు దక్కింది. ప్రాంతాలకు రక్షణ కల్పించే యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల మాదిరిగానే ఈ గౌరవం దక్కింది. సాంస్కృతిక, చారిత్రక లేదా శాస్త్రీయ ప్రాముఖ్యత ఉండే అంశాలను ఈ కేటగిరిలోకి తీసుకుంటారు.  థాయ్ మసాజ్ భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అంశంగా యునెస్కో అభివర్ణించింది. ‘ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ హ్యుమానిటీ’ అనే జాబితాలో థాయ్ మసాజ్‌కు స్థానం కల్పించారు. సాంస్కృతిక జాబితాలో ప్రతి ఏటా కొత్తా అంశాలు జమ అవుతూ ఉంటాయి.

 పూర్వకాలంలో రైతులు రోజంతా పనిచేయడంతో బాడీ పెయిన్స్ వచ్చేవి.  వాటి నుంచి స్వాంతన పొందేందకు  వారు థాయ్ మసాజ్‌ చేయించుకునేవారు. అలా ఇది వ్యాప్తి చెందింది.  కాగా థాయ్ మసాజ్.. భారత్‌లో పుట్టింది అనే వాదనలు కూడా బలంగా ఉన్నాయి.