భ‌క్తులకు అభ‌య‌మిచ్చేందుకు బెజ‌వాడ దుర్గ‌మ్మ రెడీ..!

|

May 15, 2020 | 5:48 PM

వ్యాక్సిన్ గానీ, మెడిసిన్ కానీ క‌నుగొనే వ‌ర‌కు క‌రోనాతో జీవ‌నం సాగించాల్సిందే అని సీఎం జ‌గ‌న్ ఇప్ప‌టికే ప‌ల‌మార్లు చెప్పిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ప‌లువురు మేధావులు, నిపుణులు..కేంద్రంలో పెద్ద‌లు కూడా ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్ అమ‌లుచేస్తూనే కొన్ని నిబంధనలు స‌డ‌లిస్తూ ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ క్ర‌మంలో దేవాలయాల్లో భక్తులను అనుమతించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తిరుమలలో వెంక‌టేశ్వ‌రస్వామి దర్శనానికి టీటీడీ క‌స‌ర‌త్తులు ప్రారంభించ‌గా… తాజాగా […]

భ‌క్తులకు అభ‌య‌మిచ్చేందుకు బెజ‌వాడ దుర్గ‌మ్మ రెడీ..!
Follow us on

వ్యాక్సిన్ గానీ, మెడిసిన్ కానీ క‌నుగొనే వ‌ర‌కు క‌రోనాతో జీవ‌నం సాగించాల్సిందే అని సీఎం జ‌గ‌న్ ఇప్ప‌టికే ప‌ల‌మార్లు చెప్పిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత ప‌లువురు మేధావులు, నిపుణులు..కేంద్రంలో పెద్ద‌లు కూడా ఇదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేశారు. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్ అమ‌లుచేస్తూనే కొన్ని నిబంధనలు స‌డ‌లిస్తూ ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఈ క్ర‌మంలో దేవాలయాల్లో భక్తులను అనుమతించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే తిరుమలలో వెంక‌టేశ్వ‌రస్వామి దర్శనానికి టీటీడీ క‌స‌ర‌త్తులు ప్రారంభించ‌గా… తాజాగా బెజ‌వాడ దుర్గ‌మ్మ ద‌ర్శ‌నం భ‌క్తుల‌కు క‌ల్పించేందుకు అధికారులు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఆలయానికి భక్తులు దర్శనానికి వచ్చే సమయంలో క‌రోనాకు ముందు జాగ్ర‌త్త‌గా తీసుకునే అన్ని ర‌కాల‌ నియమనిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా భౌతిక దూరం పాటిస్తూ..అమ్మవారి ద‌ర్శ‌నం చేయించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

అమ్మ‌వారి ద‌ర్శ‌నం టిక్కెట్లను ఆన్‌లైన్ లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్ ద్వారా టైమ్ స్లాట్ నిర్దార‌ణ చేసుకోవాల‌ని మార్గదర్శకాలు జారీ అయ్యాయి. 24 గంటల ముందుగానే స్లాట్ క‌న్ఫామ్ అయ్యేలా దేవస్థానం బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గంటకు 250 మంది భక్తులకు మించకుండా.. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే ద‌ర్శ‌నానికి ప‌ర్మిష‌న్ ఇవ్వాల‌ని అధికారులు భావిస్తున్నారు. ఆధార్ నెంబర్‌తోపాటు దర్శన సమయాన్ని సంక్షిప్త సందేశాల ద్వారా భక్తులు తెలపనున్నారు. అయితే ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా శఠగోపం, తీర్థం పంపిణి, అంతరాలయ దర్శనం నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.