#COVID2019 కౌలాలంపూర్‌లో చిక్కుకున్న విద్యార్థులు… మూడు రోజులుగా..!

|

Mar 17, 2020 | 6:04 PM

కరోనా వైరస్ చేస్తున్న విలయ తాండవంతో భూమ్మీద ప్రతీ ఒక్కరు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. తాజాగా ఫిలిప్ఫైన్స్‌లో చదువుకుంటూ... సెలవులకు ఇండియాకు బయలుదేరిన తెలుగు వైద్య విద్యార్థులు మలేషియా రాజధాని కౌలాలంపూర్‌ ఎయిర్‌పోర్టులో...

#COVID2019 కౌలాలంపూర్‌లో చిక్కుకున్న విద్యార్థులు... మూడు రోజులుగా..!
Follow us on

Telugu students stuck up in Koulalampur airport: కరోనా వైరస్ #covidindia  చేస్తున్న విలయ తాండవంతో భూమ్మీద ప్రతీ ఒక్కరు ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతోంది. తాజాగా ఫిలిప్ఫైన్స్‌లో చదువుకుంటూ… సెలవులకు ఇండియాకు బయలుదేరిన తెలుగు వైద్య విద్యార్థులు మలేషియా రాజధాని కౌలాలంపూర్‌ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. మూడు రోజులుగా ఎయిర్‌పోర్టులోనే గడుపుతున్న ఈ బ‌ృందంలో ఎక్కువ మంది అమ్మాయిలే వుండడం గమనార్హం.

ఫిలిప్ఫైన్స్‌లోని మెడికల్ కాలేజీల్లో చదువుకుంటున్న తెలుగు విద్యార్థులు మూడు రోజుల క్రితం ఇండియాకు బయలుదేరారు. కౌలాలంపూర్‌లో ఫ్లైట్ మారాల్సి వుండగా.. అక్కడే చిక్కుకుపోయారు. భారత్‌కు విమాన సర్వీసులు నిలిపివేయడంతో తెలుగు విద్యార్థుల బృందం ఎయిర్‌పోర్టులోనే మూడు రోజులుగా మగ్గుతున్నారు. సుమారు రెండు వేల మంది దాకా తెలుగు విద్యార్థులు ఫిలిప్ఫైన్స్‌లో వైద్య విద్యను అభ్యసిస్తుండగా.. ప్రస్తుత పరిస్థితుల్లో వారికి హాలిడేస్ ప్రకటించారు. దాంతో స్వదేశానికి వద్దామనుకున్న వీరందరికీ.. విదేశాల నుంచి విమాన సర్వీసులను నిలిపివేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయం శాపంగా మారింది.

మనీలా నుంచి కౌలాలంపూర్ చేరుకున్న తమకు ఇండియాకు వెళ్ళే ఫ్లైట్ దొరక్కపోవడంతో ఎయిర్‌పోర్టులోనే వుండిపోయామని తెలుగు విద్యార్థులు వీడియో సందేశాలను తమ పేరెంట్స్‌కు పంపుతున్నారు. అవి కాస్తా మీడియాకు చేరుతున్నాయి. తమ ‌బృందంలో కేవలం విద్యార్థులమే లేమని.. చాలా మంది వయోజనులు కూడా వున్నారని.. వారిలో ఇమ్యూన్ పవర్ తక్కువ వుండడం వల్ల కరోనా బారిన పడే ప్రమాదం ఎక్కువ అని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఎలాగైనా భారత్ రప్పించాలంటూ విద్యార్థులు వేడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జోక్యం చేసుకోవాలని అర్థిస్తున్నారు.

అయితే.. టీవీ9లో దీనికి సంబంధించి వచ్చిన వార్తలకు కౌలాలంపూర్‌లోని ఇండియన్ అంబసీ స్పందించింది. ప్రస్తుతం మొత్తం 230 మంది విద్యార్థులు కౌలాలంపూర్ ఎయిర్‌పోర్టులో వున్నారని.. గుర్తించారు. వారిని ఫోన్‌లో సంప్రదించిన ఎంబసీ అధికారులు.. వారందరికీ విమాన టిక్కెట్లు అరేంజ్ చేస్తామని.. కేంద్ర ప్రభుత్వ అనుమతి రాగానే వారికి ఇండియాకు పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.