‘‘దేశ భాషలందు తెలుగు లెస్స’’.. అమెరికాలోనూ సేమ్ సీన్

| Edited By:

Aug 29, 2019 | 11:41 AM

ప్రపంచ భాషలందూ తెలుగు భాషకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. స్వచ్ఛమైన భాషగా పిలవబడే మన మాతృ భాష తెలుగుపై మనం కాస్త నిర్లక్ష్యం వహించినా.. మిగిలిన దేశాల్లో మాత్రం దీనికి ఆదరణ పెరుగుతోంది. ఇక అగ్రరాజ్యం అమెరికాలో మన తెలుగు భాష వేగంగా విస్తరిస్తోంది. తెలుగు మాట్లాడేవారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. 2010 నుంచి 2017 మధ్య తెలుగు మాట్లాడేవారి సంఖ్య ఏకంగా 86% పెరిగింది. అమెరికాలో విదేశీ భాషలకు ఉన్న ఆదరణపై సెంటర్ […]

‘‘దేశ భాషలందు తెలుగు లెస్స’’.. అమెరికాలోనూ సేమ్ సీన్
Follow us on

ప్రపంచ భాషలందూ తెలుగు భాషకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. స్వచ్ఛమైన భాషగా పిలవబడే మన మాతృ భాష తెలుగుపై మనం కాస్త నిర్లక్ష్యం వహించినా.. మిగిలిన దేశాల్లో మాత్రం దీనికి ఆదరణ పెరుగుతోంది. ఇక అగ్రరాజ్యం అమెరికాలో మన తెలుగు భాష వేగంగా విస్తరిస్తోంది. తెలుగు మాట్లాడేవారి సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. 2010 నుంచి 2017 మధ్య తెలుగు మాట్లాడేవారి సంఖ్య ఏకంగా 86% పెరిగింది. అమెరికాలో విదేశీ భాషలకు ఉన్న ఆదరణపై సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్(సీఐఎస్) నిర్వహించిన తాజా అధ్యయనంలో ఈ లెక్కలు తేలాయి. 2000వ సంవత్సరంలో అమెరికాలో తెలుగు మాట్లాడేవాళ్ల సంఖ్య 87,543 ఉండగా.. 2010లో ఆ సంఖ్య 2,22,977 వరకు పెరిగింది. అలాగే 2017లో ఈ సంఖ్య 4,15,414కు చేరింది.

కాగా ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల నుంచి వేలాది మంది విద్యార్థులు అమెరికాకు తరలివెళ్తుంటారు. అలాగే చాలామంది టెక్, ఇంజనీరింగ్ కంపెనీల్లో పనిచేస్తున్నారు. ఇక అక్కడి సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల్లో తెలుగువారే ఎక్కువ. ఇలా అమెరికాలో తెలుగు వారు ఎక్కువ అవుతుండగా.. భాష కూడా వ్యాపిస్తోంది. మరోవైపు ఈ భాషను నేర్చుకునేందుకు పలువురు ఇతర భాషలు మాట్లాడేవారు కూడా ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ తెలుగును నేర్పేందుకు ఇనిస్టిట్యూట్‌లు కూడా వెలిశాయి. మొత్తానికి ప్రపంచాన్ని ఇంగ్లీష్ భాష శాసిస్తున్న ఈ కాలంలో.. ఇంగ్లీష్ దేశంలో మన మాతృ భాష హవాను కొనసాగించడం గర్వించదగ్గ విషయమే.

అయితే భాష మాట్లాడేవారి సంఖ్య చూస్తే… హిందీ టాప్ ప్లేస్‌లోనే ఉంది. అమెరికాలో హిందీని 8.6 లక్షలు, గుజరాతీని 4.3 లక్షలు, తెలుగును 4.2 లక్షలు, బెంగాలీని 3.5 లక్షలు, పంజాబీని 3.1 లక్షలు, తమిళ్‌ని 2.1 లక్షల మంది మాట్లాడుతున్నారు.