“సీఏఏ”పై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ కేబినెట్..

| Edited By:

Feb 17, 2020 | 1:54 AM

తెలంగాణ కేబినెట్ సమావేశం ఆదివారం ప్రగతి భవన్‌లో జరిగింది. సుధీర్ఘంగా ఆరు గంటలు సాగిన ఈ సమావేశంలో.. పలు కీలక నిర్ణయలు తీసుకుంది. సీఎం అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటుగా సీఏఏ చట్టం గురించి కూడా చర్చించారు. భారత పౌరసత్వం ఇచ్చే విషయంలో.. మత పరమైన వివక్ష చూపరాదంటూ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చట్టం ముందు అన్ని మతాలను సమానంగా చూడాలని.. భారత రాజ్యాంగం ప్రసాదించిన లౌకికత్వాన్ని […]

సీఏఏపై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ కేబినెట్..
Follow us on

తెలంగాణ కేబినెట్ సమావేశం ఆదివారం ప్రగతి భవన్‌లో జరిగింది. సుధీర్ఘంగా ఆరు గంటలు సాగిన ఈ సమావేశంలో.. పలు కీలక నిర్ణయలు తీసుకుంది. సీఎం అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతో పాటుగా సీఏఏ చట్టం గురించి కూడా చర్చించారు. భారత పౌరసత్వం ఇచ్చే విషయంలో.. మత పరమైన వివక్ష చూపరాదంటూ తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. చట్టం ముందు అన్ని మతాలను సమానంగా చూడాలని.. భారత రాజ్యాంగం ప్రసాదించిన లౌకికత్వాన్ని ప్రమాదంలో పడేలా పరిణమించిన ఈ “సీఏఏ”ను రద్దు చేయాలని కేబినెట్ కోరింది. ఈ మేరకు కేబినెట్‌లో తీర్మానం కూడా చేశారు. అంతేకాదు.. తెలంగాణ అసెంబ్లీలో కూడా తీర్మానం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కాగా.. ఇప్పటికే ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. రద్దుచేయాలంటూ కేరళ, రాజస్థాన్, పంజాబ్, ప్రభుత్వాలు అసెంబ్లీలో తీర్మానాలు ప్రవేశపెట్టాయి.