టీపీసీసీ రేసులో నేనున్నానంటే.. నేనున్నానంటూ ప్రకటనలు గుప్పిస్తోన్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు

|

Dec 06, 2020 | 5:54 AM

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయం తెలంగాణ కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ లా పరిణమించింది. పార్టీ అపజయానికి బాధ్యత వహిస్తూ...

టీపీసీసీ రేసులో నేనున్నానంటే.. నేనున్నానంటూ ప్రకటనలు గుప్పిస్తోన్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలు
Follow us on

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయం తెలంగాణ కాంగ్రెస్ కు కోలుకోలేని షాక్ లా పరిణమించింది. పార్టీ అపజయానికి బాధ్యత వహిస్తూ ఆపార్టీ అధ్యక్షుడి పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో ఆశావహ నేతలు గళమెత్తుతున్నారు. సీనియర్ నేతలు తాము రెడీ అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆపార్టీ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్‌ ఓటమికి ఉత్తమ్ ఒక్కరే బాధ్యుడు కాదని… పీసీసీలో ఉండే ప్రతి నాయకుడిదని జగ్గా వెల్లడించారు. పీసీసీ చీఫ్‌ పదవి కోసం తాను సీరియస్‌గా ప్రయత్నిస్తున్నానని తెలిపారు. త్వరలో ఢిల్లీ వెళ్లి రాహుల్‌ గాంధీని కలుస్తానని పేర్కొన్నారు. ఇలా ఉంటే, తెలంగాణ పీసీసీ చీఫ్ రేసులో తాను కూడా ముందున్నానని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. పీసీసీ చీఫ్‌ ఇస్తే కాంగ్రెస్‌ శక్తులను ఏకతాటిపైకి తెస్తానన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు చూసైనా ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేయాలని ప్రభుత్వానికి చురకలు అంటించారు. అటు, మధుయాష్కీ కూడా సై అంటున్నారు. కాగా, జానారెడ్డి పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న ప్రచారాలను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొట్టిపారేశారు. జానారెడ్డి పార్టీ మారతారంటూ సోషల్‌మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఇక పీసీసీ చీఫ్‌ను అధిష్ఠానం నిర్ణయిస్తుందని భట్టి తేల్చిచెప్పారు.