సచివాలయ తరలింపు ప్రక్రియ షురూ..

| Edited By: Srinu

Jul 09, 2019 | 12:40 PM

తెలంగాణ సచివాలయ తరలింపు ప్రక్రియ ఊపందుకుంటోంది. తాజాగా ఏయే విభాగాలను ఎక్కడికి తరలించాలనే నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. సీఎం ఛాంబర్‌తో పాటు ఇతర సీఎంఓ, సీఎస్‌, జీఏడీలను సచివాలయం పక్కనే ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో ఎనిమిది, తొమ్మిది అంతస్తులకు మార్చాలని డిసైడ్ అయ్యారు. జీఏడీని ఈ భవనానికే షిఫ్ట్ చేస్తారు. మిగిలిన శాఖలను దగ్గరలో ఉన్న భవనాలకు తరలించనున్నారు. వీలైనంత త్వరగా తరలింపు చేపట్టి.. కొత్త సచివాలయ నిర్మాణ పనుల్ని మొదలుపెట్టాలని అధికారుల్ని ప్రభుత్వం […]

సచివాలయ తరలింపు ప్రక్రియ షురూ..
Follow us on

తెలంగాణ సచివాలయ తరలింపు ప్రక్రియ ఊపందుకుంటోంది. తాజాగా ఏయే విభాగాలను ఎక్కడికి తరలించాలనే నిర్ణయం తీసుకున్నారు సీఎం కేసీఆర్. సీఎం ఛాంబర్‌తో పాటు ఇతర సీఎంఓ, సీఎస్‌, జీఏడీలను సచివాలయం పక్కనే ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో ఎనిమిది, తొమ్మిది అంతస్తులకు మార్చాలని డిసైడ్ అయ్యారు. జీఏడీని ఈ భవనానికే షిఫ్ట్ చేస్తారు. మిగిలిన శాఖలను దగ్గరలో ఉన్న భవనాలకు తరలించనున్నారు. వీలైనంత త్వరగా తరలింపు చేపట్టి.. కొత్త సచివాలయ నిర్మాణ పనుల్ని మొదలుపెట్టాలని అధికారుల్ని ప్రభుత్వం ఆదేశించింది.

ఆర్అండ్‌బీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రుల బృందం ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. వాస్తవానికి తరలింపునకు రెండు నెలల సమయం అడిగారు అధికారులు.. సీఎం మాత్రం 15 రోజుల్లో తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముందుగా సాధారణ పరిశీలనశాఖలోని ఫైళ్లు, కంపూటర్లు ఇతర సామాగ్రిని బూర్గుల రామకృష్ణ భవన్‌కు తరలించనున్నారు. నిర్మాణ పనులకు ఆటంకం కలుగకుండా వెంటనే ఆయా శాఖలను తరలించాలని సూచించారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి అన్ని శాఖలకు ఉత్తర్వులు ఇచ్చారు.

ఇక తరలింపు సమయంలో ఫైళ్లు తప్పిపోవడం, కీలక డాక్యుమెంట్లు చిరగడం, మాయమవడం లాంటివి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు. పురావస్తు విభాగంలోని పురాతన పత్రాలు సున్నితంగా ఉంటాయి. కొన్ని పట్టుకుంటే చినిగిపోయే స్థితిలో ఉన్నాయి. వీటిని తరలించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసి ఉంటుందని చెప్పారు. ఆ పత్రాలను ముందుగానే జిరాక్స్ తీయించడం, స్కాన్ చేసిపెట్టడం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది.